ఐఐటీ జోధ్‌పూర్‌లో హిందీలో ఇంజినీరింగ్‌ !


ఐటీ జోధ్‌పూర్‌లో చేరే విద్యార్థులు బీటెక్‌ కోర్సును హిందీ మీడియంలో చదువుకోవచ్చు. జేఈఈ అడ్వాన్స్‌డ్ ఆధారంగా విద్యార్థులకు బీటెక్‌లో ప్రవేశం కల్పిస్తారు. దేశంలో హిందీలో బీటెక్‌ చదువులను అందించే తొలి ఐఐటీగా జోధ్‌పూర్‌ ఐఐటీ నిలిచింది. ఆంగ్లంలో పరిమిత ప్రావీణ్యం కలిగిన విద్యార్థులను దృష్టిలో ఉంచుకుని జోధ్‌పూర్ ఐఐటీ ఈ ప్రయత్నం మొదలుపెట్టింది. జాతీయ విద్యా విధానం 2020 కింద ఈ నూతన కోర్సును ప్రవేశపెడుతున్నారు. జోధ్‌పూర్‌ ఐఐటీలో ఇకపై హిందీ, ఇంగ్లీష్ మీడియంలలో బిటెక్ చేయవచ్చు. ఈ ప్రయోగం విజయవంతమైతే దేశంలోని ఇతర ఐఐటీలలో కూడా దీనిని అమలు చేసే అవకాశాలున్నాయి.


Post a Comment

0 Comments