ఆంధ్రప్రదేశ్ లోని మదనపల్లె సబ్‌కలెక్టర్ కార్యాలయం ఘటనలో వైకాపా నేత పెద్దిరెడ్డి పాత్రపై ప్రభుత్వం అనుమానాలు వ్యక్తం చేస్తోంది. గతంలో భూమార్పిడికి పెద్దిరెడ్డి భార్య దరఖాస్తు చేసుకున్నారని, 986 ఎకరాల అసైన్డ్ భూముల మార్పిడి ప్రక్రియ చేపట్టారని విచారణలో తేలిందని మంత్రి అనగాని సత్యప్రసాద్ వెల్లడించారు. పెద్దిరెడ్డి భార్య దరఖాస్తు పత్రాలను ఆయన తాజాగా విడుదల చేశారు. ఈ భూమార్పిడి పత్రాలను మాయం చేసేందుకే అగ్నిప్రమాదం సృష్టించినట్లు అనుమానం కలుగుతోందన్నారు. పెద్దిరెడ్డి, నాటి జేసీ పాత్రపై ఆధారాలున్నాయని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. పెద్దిరెడ్డి మంత్రిగా పని చేసిన శాఖల్లో అక్రమాల ఆధారాలను మాయం చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. పీసీబీలో ఫైళ్ల దగ్ధం, ఎక్సైజ్ శాఖలో ఫైళ్ల మాయం ఘటనలను ప్రభుత్వం అనుమానిస్తోంది.
భూ మార్పిడి పత్రాల మాయానికి యత్నం ?
الاثنين، 22 يوليو 2024
Andhra Pradesh భూ మార్పిడి పత్రాల మాయానికి యత్నం ? భూమార్పిడికి పెద్దిరెడ్డి భార్య దరఖాస్తు చేసుకున్నారని మంత్రి అనగాని సత్యప్రసాద్ మదనపల్లె సబ్‌కలెక్టర్ కార్యాలయం ఘటన
ليست هناك تعليقات:
إرسال تعليق