ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం వైఎస్ జగన్‌పై కాంగ్రెస్ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల మరోసారి మండిపడ్డారు. సొంత బాబాయ్‌ను హత్య చేసినప్పుడు జగన్ ఎందుకు ఢిల్లీ వెళ్లి ధర్నా చేయలేదని ప్రశ్నించారు. సొంత చెల్లమ్మను వెన్నుపోటు పొడిచారని వైఎస్ షర్మిల జగన్‌పై ఫైర్ అయ్యారు. సొంత బాబాయ్‌ను కూడా హత్య చేయించారన్నారు. బాబాయ్ వివేకానంద రెడ్డి హత్యపై ఢిల్లీలో ధర్నా ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. ప్రస్తుతం బాబాయ్‌ని చంపిన వారితో కలిసి జగన్ తిరుగుతున్నారన్నారు. దీంతో పాటుగా రాష్ట్రంలో చేటుచేసుకుంటున్న ప్రస్తుత పరిస్థితులపై కూడా ఘాటు వ్యాఖ్యలు చేశారు. భారీ వర్షాల నేపథ్యంలో రైతులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వారిని ప్రభుత్వం ఆదుకోవాలన్నారు. వినుకొండ ఘటన వ్యక్తిగత కారణాలతో జరిగిందని, అతి రాజకీయ హత్య కాదన్నారు. గత పదేళ్లగా కేంద్రం ప్రవేశ పెడుతున్న బడ్జెట్లో ఏపీకి తీవ్ర అన్యాయం జరుగుతోందని షర్మిల ఆరోపించారు. ఎన్డీఏ సర్కార్ ఏర్పాటులో కీలకంగా మారిని టీడీపీ ఈ సారి అయినా రాష్ట్రానికి ప్రత్యేక కేటాయింపులు తీసుకువస్తుందా లేదా అని ప్రశ్నించారు. ఎన్డీఏలో కూటమి ప్రభుత్వం భాగస్వాములుగా ఉన్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఎన్ని నిధులు తీసుకువస్తారో చెప్పాలన్నారు. అసలు జగన్ ఢిల్లీలో ఎందుకు ధర్నా చేస్తున్నారో చెప్పగలరా అంటూ ప్రశ్నించారు. పార్టీ ఉనికి కోసమే ఢిల్లీలో జగన్ ధర్నాలు చేస్తున్నారని ఆరోపించారు. గత ఐదేళ్లు ఎందుకు ప్రత్యేక హోదా కోసం పోరటం చేయలేదని షర్మిల జగన్‌ను ప్రశ్నించారు.
సొంత బాబాయ్‌ను హత్య చేసినప్పుడు జగన్ ఢిల్లీ వెళ్లి ఎందుకు ధర్నా చేయలేదు !
الاثنين، 22 يوليو 2024
Andhra Pradesh కాంగ్రెస్ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల సొంత చెల్లమ్మను వెన్నుపోటు పొడిచారని సొంత బాబాయ్‌ను హత్య చేసినప్పుడు జగన్ ఢిల్లీ వెళ్లి ఎందుకు ధర్నా చేయలేదు
ليست هناك تعليقات:
إرسال تعليق