స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ షియోమీ తొలి ఎలక్ట్రిక్ కారును మార్కెట్‌లోకి తీసుకురాబోతోంది. అతి త్వరలో ఆటోమొబైల్ రంగంలోకి ఎంట్రీ ఇస్తున్న షియోమీ కంపెనీ అబ్బురపరిచే ఫీచర్లతో ఓ ఎలక్ట్రిక్ కార్ రెడీ చేస్తోంది. షియోమీ ఎస్ యూ 7 ఎలక్ట్రిక్ పేరుతో ఇప్పటికే చైనాలో విడుదలైన ఈ కార్ అక్కడ టెస్లా కారుకు గట్టి పోటీ ఇస్తోంది. చైనాలో ఈ ఎలక్ట్రిక్ కారు ధర 2,15,900 యువాన్‌లు. మన కరెన్సీలో రూ.25 లక్షలు. ఇండియన్ మార్కెట్‌లో షియోమీ అడుగు పెట్టి పదేళ్లు పూర్తయిన సందర్భంగా బెంగళూరులో ఈ కారును ఎగ్జిబిట్ చేశారు. ఇండియాలో ఈ కార్‌పై భారీ అంచనాలున్నాయి. ప్రస్తుతం భారత్ లో షియోమీకి స్మార్ట్‌ఫోన్‌ల బిజినెస్ చాలా స్ట్రాంగ్ గా ఉండగా.. ఇప్పుడు ఈ కంపెనీ ఆటోమొబైల్ రంగంలోకి వస్తుండటం ఆసక్తికర అంశం. ఈ కారు 5 మీటర్ల పొడవుతో ప్రీమియం సెడాన్ లో డ్యుయల్ మోటర్స్ ఉంటాయి. 101KWH బ్యాటరీతో రూపొందించిన ఈ కారు ఒక్కసారి ఛార్జ్ చేస్తే 800 కిలోమీటర్లు ప్రయాణించగలిగేలా డిజైన్ చేశారు. లగ్జరీ ఎక్స్‌టీరియర్, గ్రాండ్ లుక్ ఈ కారుకు అదనపు ఆకర్షణలు.
0 Comments