ఆంధ్రప్రదేశ్ లోని మాచర్ల మాజీ ఎంఎల్ఏ పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పరామర్శించడానికి మాజీ సీఎం జగన్ రూ.25 లక్షలు ఖర్చు చేశారని హోంమంత్రి అనిత ఆరోపించారు. పిన్నెల్లిని కలిసేందుకు ఆయన హెలికాప్టర్‌లో నెల్లూరు జైలుకు వెళ్లారని చెప్పారు. జైలులో పిన్నెల్లిని కలిసేందుకు ఉన్న ములాఖత్‌లు అయిపోయాయని, మానవతా దృక్పథంతో జగన్‌కు అనుమతి ఇచ్చామని తెలిపారు. అనుమతి ఇచ్చే పరిస్థితి లేదని తెలిసి కూడా జగన్, ఘర్షణ వాతావరణం సృష్టించడానికే ఈ ప్రయత్నం చేసినట్లు తెలుస్తోందన్నారు. జైలు నుంచి బయటకొచ్చాక ఆయన ఏదేదో మాట్లాడి వెళ్లిపోయారన్నారు. ములాఖత్‌లపై జైళ్ల శాఖ ఐజీ నుంచి కూడా నివేదిక తెప్పించుకుని పరిశీలిస్తానని హోంమంత్రి పేర్కొన్నారు. గత ప్రభుత్వం తనపై అట్రాసిటీ కేసులు పెట్టిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు. అక్రమంగా పెట్టిన కేసులపై విచారణ చేపడతామన్నారు. వాటిపై న్యాయపరంగా చర్చించి తదుపరి నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు.
పిన్నెల్లిని పరామర్శించడానికి జగన్ చేసిన ఖర్చు రూ.25 లక్షలు ?
الخميس، 4 يوليو 2024
Andhra Pradesh పిన్నెల్లిని పరామర్శించడానికి జగన్ చేసిన ఖర్చు రూ.25 లక్షలు ? మానవతా దృక్పథంతో జగన్‌కు అనుమతి హెలికాప్టర్‌లో నెల్లూరు జైలుకు వెళ్లారని హోంమంత్రి అనిత ఆరోపణ
ليست هناك تعليقات:
إرسال تعليق