నటులు, వారి కుటుంబసభ్యులే లక్ష్యంగా వ్యక్తిగత విమర్శలు, అసత్య వార్తలను పోస్ట్ చేస్తున్న మరో 18 యూట్యూబ్ ఛానళ్లను రద్దు చేయించినట్లు మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ తాజాగా తెలిపింది. 'బ్రహ్మి ట్రోల్స్ 3.0', 'టీకే క్రియేషన్స్', 'డాక్టర్ ట్రోల్స్', 'ట్రోలింగ్ పోరడు', 'అప్‌డేట్ ట్రోల్స్' వంటివి రద్దు చేయబడిన యూట్యూబ్ ఛానల్స్ జాబితాలో ఉన్నాయి. హీరో హీరోయిన్లను విమర్శిస్తూ చేసిన వీడియోలను, కామెంట్లను 48 గంటల్లోగా తొలగించాలంటూ డిజిటల్ కంటెంట్ క్రియేటర్స్‌కు 'మా' అధ్యక్షుడు మంచు విష్ణు ఇటీవల విజ్ఞప్తి (Vishnu Manchu) చేసిన విషయం తెలిసిందే. ట్రోలింగ్ వీడియోలను డిలీట్ చేయకపోతే తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ క్రమంలోనే దాదాపు ఐదు యూట్యూబ్ ఛానల్స్‌ను తొలుత రద్దు చేయించారు. ''ఇది ఆరంభం మాత్రమేనని, భవిష్యత్‌లో ఇలాంటి ఛానళ్లపై చర్యలు కొనసాగుతాయి'' అంటూ పోస్ట్ పెట్టారు.
మరో 18 యూట్యూబ్ ఛానళ్లు రద్దు !
الأربعاء، 24 يوليو 2024
'టీకే క్రియేషన్స్' 'ట్రోలింగ్ పోరడు' 'డాక్టర్ ట్రోల్స్' 'బ్రహ్మి ట్రోల్స్ 3.0' Andhra Pradesh cinema telangana మరో 18 యూట్యూబ్ ఛానళ్లు రద్దు మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ తాజాగా తెలిపింది
ليست هناك تعليقات:
إرسال تعليق