జాతీయ స్థాయిలో 'నీట్' పరీక్షలో జరిగిన అవకతవకలపై సీబీఐతో విచారణ జరిపించాలని తెలంగాణ పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్‌బాబు కేంద్రాన్ని డిమాండ్ చేశారు. పరీక్షా పత్రాలు లీక్ అయినట్లు ఆరోపణలు రావడం ఒకటైతే, 63 మంది విద్యార్థులకు ఒకే ర్యాంకు రావడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. గురువారం ఆయన శాసనసభలో కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. పరీక్షల నిర్వహణ, ఫలితాల అంశంలో విద్యార్థులకు తీవ్ర అన్యాయం జరిగిందని, దీనిపై తక్షణమే కేంద్రం స్పందించాలని కోరారు. దీనికి బా ధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఫిబ్రవరి 9వ తేదీ నుంచి నెలరోజులపాటు దరఖాస్తు చేసుకోవడానికి అనుమతినిచ్చి ఆ తరువాత మరో వారం రోజులు గడువును నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ పొడిగించిందని మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. పరీక్షల ఫలితాలు జూన్ 14వ తేదీ రావాల్సి ఉండగా పదిరోజుల ముందుగానే ప్రకటించడం కూడా అనుమానాలు మరింత పెరగడానికి అవకాశం ఏర్పడిందని అన్నారు. దేశవ్యాప్తంగా విద్యార్థి సంఘాలు ఆందోళన చేస్తున్నాయని, గ్రేస్ మార్కులు కూడా ఇష్టానుసారం కలిపారని మంత్రి ఆరోపించారు. నీట్ పరీక్షల నిర్వహణలో నేషనల్ డెమొక్రటిక్ అలయెన్స్(ఎన్డీయే)పూర్తిగా విఫలమైందని ఆయన దుయ్యబట్టారు.
నీట్‌పై సీబీఐ విచారణ జరిపించాలి : మంత్రి శ్రీధర్‌బాబు
الجمعة، 21 يونيو 2024
63 మంది విద్యార్థులకు ఒకే ర్యాంకు national telangana నీట్‌పై సీబీఐ విచారణ జరిపించాలి పరీక్షల నిర్వహణ ఫలితాల అంశంలో విద్యార్థులకు తీవ్ర అన్యాయం మంత్రి శ్రీధర్‌బాబు
ليست هناك تعليقات:
إرسال تعليق