ఢిల్లీ వాసులను చినుకులు పలకరించాయి. శుక్రవారం ఉదయం నుండి ఢిల్లీతో పాటు ఎన్‌సిఆర్ పరిధిలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి. వేడిగాలులతో అల్లాడి పోయిన ప్రజలు ఊపిరిపీల్చుకుంటున్నారు. హర్యానా, గురుగ్రామ్‌ల్లోనూ వర్షం కురిసినట్లు అధికారులు తెలిపారు. ఉదయం నుండే ఆకాశం మేఘావృతమై ఉంది. కనిష్ట ఉష్ణోగ్రత 28.4 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైనట్లు భారత వాతావరణ శాఖ (ఐఎండి) తెలిపింది. నగరంలోని పలు ప్రాంతాల్లో ఉరుములతో కూడిన తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. అయితే గరిష్ట ఉష్ణోగ్రత 40 డిగ్రీల సెల్సియస్‌గా నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది.
ఢిల్లీ వాసులకు వేడిగాలుల నుంచి ఉపశమనం !
الجمعة، 21 يونيو 2024
national New Delhi weather గురుగ్రామ్‌ల్లోనూ వర్షం ఢిల్లీ వాసులకు వేడిగాలుల నుంచి ఉపశమనం భారత వాతావరణ శాఖ హర్యానా
ليست هناك تعليقات:
إرسال تعليق