ఇటలీలోని అపూలియా ప్రాంతంలో జీ7 సదస్సు జరుగుతోంది. ఈ గ్రూప్ సభ్య దేశాల అధినేతలతో పాటు పలు ఆహ్వానిత దేశాల నాయకులు దీనికి హాజరయ్యారు. మన ప్రధాని నరేంద్ర మోడీ కూడా గురువారం రాత్రే ఇటలీలో చేరుకున్నారు. ఈ అంతర్జాతీయ సదస్సులో తన వ్యవహారశైలితో అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ మరోసారి వార్తల్లో నిలిచారు. జీ7కి వచ్చిన నేతలంతా గ్రూప్ ఫొటోకు పోజు ఇచ్చారు. ఆ సమయంలో బైడెన్ మాత్రం నేతలు ఉన్నవైపు కాకుండా మరోవైపు తిరిగి, ఎవరి కోసమో వెతుకుతున్నట్టుగా ముందుకు వెళ్లారు. అలాగే ఎవరితోనో మాట్లాడుతూ కనిపించారు. ఆ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అయితే ఆ నిల్చున్న వైపు ఎవరూ లేరు. ఎంతసేపటికీ ఆయన గ్రూప్ ఫొటో దిగేందుకురాకపోవడంతో ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ వెళ్లి ఆయన్ను తీసుకువచ్చారు. దీంతో 81 ఏళ్ల బైడెన్ నేతలతో కలిసి ఫొటో దిగారు. ఈ ఘటనను వీక్షించిన నెటిజన్లు ఆశ్చర్యపోయారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై అనుమానాలు వ్యక్తం చేశారు. కొన్నాళ్ల క్రితం వైట్‌హౌస్‌లో జరిగిన సాంస్కృతిక కార్యక్రమంలో అధ్యక్షుడి ప్రవర్తన ఇలాగే ఉంది. ఆయన చుట్టూ ఉన్నవారంతా అక్కడ వినిపిస్తున్న సంగీతానికి తగ్గట్టుగా కాలుకదుపుతుంటే, బైడెన్ మాత్రం కొంతసేపు అలాగే నిల్చుండిపోయారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల వేళ ఇలాంటి దృశ్యాలు ప్రతిపక్ష రిపబ్లికన్ పార్టీకి అస్త్రాలుగా మారుతున్నాయి. వయసురీత్యా వచ్చే ఇబ్బందుల వల్ల బైడెన్ జ్ఞాపకశక్తిలో లోపాలను గుర్తించినట్లు గతంలో ఒక నివేదిక విడుదలైన సంగతి తెలిసిందే. అధ్యక్షుడి జ్ఞాపకశక్తి చాలా ''మసక''గా, ''మబ్బు''గా ఉందని నివేదిక పేర్కొంది. జీవితంలోని కీలక సంఘటనలను సైతం ఆయన గుర్తుకు తెచ్చుకోలేకపోయారని తెలిపింది. కుమారుడు బ్యూ బైడెన్ ఎప్పుడు చనిపోయారనే విషయమూ జ్ఞప్తికి రాలేదని పేర్కొంది. ఉపాధ్యక్షుడిగా పనిచేసిన కాలం కూడా గుర్తులేదని తెలిపింది. ఈ నివేదికను ఆయన తీవ్రంగా ఖండించారు. అయితే ఇవన్నీ డెమోక్రాటిక్ పార్టీకి ఇబ్బందికరంగా మారాయి.
నేతలంతా ఒకవైపు - బైడెన్ మరోవైపు !
الجمعة، 14 يونيو 2024
international ఇటలీలోని అపూలియా ప్రాంతంలో జీ7 సదస్సు జీ7కి వచ్చిన నేతలంతా గ్రూప్ ఫొటోకు పోజు నేతలంతా ఒకవైపు - బైడెన్ మరోవైపు సోషల్ మీడియాలో వైరల్
ليست هناك تعليقات:
إرسال تعليق