ఆంధ్ర ప్రదేశ్ తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి లో మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వానికి అభినందనలు చెప్పారు. ఢిల్లీలో చక్రం తిప్పే అవకాశం చంద్రబాబుకు వచ్చిందని, ఆంధ్రప్రదేశ్ ఫలితాలు తోటే కేంద్రంలో మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని వివరించారు. బీజేపీ పొత్తు లేకపోయినా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి వచ్చే నష్టం ఏమీ లేదు, కూటమి పొత్తు లేకపోతే ప్రధాని మోడీకి నష్టం అన్నారు. ఇప్పటికైనా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి రావలసిన వి రాబట్టాలని, మీరు ఏమి చెప్పితే అదే జరుగుతుందని తెలిపారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిలుపుదల, రైల్వే జోన్ ఏర్పాటు సాధించాలని రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ డిమాండ్ చేశారు.
రాష్ట్రానికి రావాల్సిన నిధులు తీసుకురావాలి : ఉండవల్లి డిమాండ్ !
الجمعة، 14 يونيو 2024
Andhra Pradesh ఢిల్లీలో చక్రం తిప్పే అవకాశం చంద్రబాబుకు వచ్చిందని రాజమండ్రి లో మాజీ ఎంపీ రాష్ట్రానికి రావాల్సిన నిధులు తీసుకురావాలి : ఉండవల్లి డిమాండ్
ليست هناك تعليقات:
إرسال تعليق