టీ20 ప్రపంచ కప్‌లో గ్రూప్-సీ నుంచి అఫ్గానిస్థాన్, వెస్టిండీస్ సూపర్-8కి చేరుకుంది. పాపువా న్యూగినీపై అద్భుత విజయం సాధించిన అఫ్గాన్ ప్రస్తుతం అగ్రస్థానంలో కొనసాగుతోంది. దీంతో న్యూజిలాండ్ టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఆ జట్టు ఆడాల్సిన చివరి రెండు మ్యాచ్‌లు ఇక నామ మాత్రమే. ఉగాండా, పాపువా న్యూగినీ కూడా ఇంటిముఖం పట్టాయి. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూగినీ 19.5 ఓవర్లలో 95 పరుగులకే ఆలౌటైంది. ఆ జట్టులో కిప్లిన్ డొరిగా (27) మాత్రమే కొద్దిసేపు నిలదొక్కుకున్నాడు. అతడితోపాటు టోని ఉరా (11), అలీ నావో (13) మాత్రమే రెండంకెల స్కోరు చేశారు. అఫ్గాన్ బౌలర్ ఫరూఖి (3/16), నవీన్ ఉల్ హక్ (2/4), నూర్ అహ్మద్ (1/14) అదరగొట్టారు. అనంతరం లక్ష్య ఛేదనలో అఫ్గాన్ కూడా కష్టపడాల్సి వచ్చింది. 15.1 ఓవర్లలో మూడు వికెట్లను నష్టపోయి.. లక్ష్యాన్ని ఛేదించింది. ఓపెనర్లు గుర్బాజ్ (11), ఇబ్రహీం జద్రాన్ (0) త్వరగా ఔటయ్యారు. అయితే, గుల్బాదిన్ నైబ్ (49*) ఓ వైపు క్రీజ్‌లో కుదురుకున్నాడు. ఒమర్జాయ్ (13), మహమ్మద్ నబీ (16*)తో కలిసి జట్టును గెలిపించాడు. అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శన చేసిన ఫరూఖి 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డును సొంతం చేసుకున్నాడు. డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్ మళ్లీ దుమ్మరేపింది. టీ20 ప్రపంచ కప్ గ్రూప్-B మ్యాచ్‌లో ఒమన్‌పై ఇంగ్లండ్ ఘన విజయం సాధించి 'సూపర్ - 8' రేసులోకి దూసుకొచ్చింది. ఒమన్‌ను కేవలం 47 పరుగులకే ఆలౌట్ చేసిన ఇంగ్లండ్ 3.1 ఓవర్లలోనే 50 పరుగులు చేసింది. కెప్టెన్ జోస్ బట్లర్ (24*: 8 బంతుల్లో 4 ఫోర్లు, ఒక సిక్స్), ఫిలిప్ సాల్ట్ (12: రెండు సిక్స్‌లు), జానీ బెయిర్ స్టో (8*: రెండు ఫోర్లు) దూకుడుగా ఆడారు. తొలుత ఇంగ్లండ్ బౌలర్లు అదిల్ రషీద్ (4/11), మార్క్ వుడ్ (3/12), జోఫ్రా ఆర్చర్ (3/12) దెబ్బకు ఒమన్ బ్యాటర్లు విలవిలాడారు. దీంతో ఇంగ్లండ్ (+3.081) నెట్‌రన్‌రేట్‌ను గణనీయంగా పెంచుకుంది. ప్రస్తుతం మూడు మ్యాచులను ఆడిన ఇంగ్లండ్ 3 పాయింట్లతో కొనసాగుతోంది. తన చివరి మ్యాచ్‌లో నమీబియాపై విజయం సాధించి.. మరోవైపు ఆసీస్ చేతిలో స్కాట్లాండ్ ఓడిపోతేనే ఇంగ్లండ్‌కు 'సూపర్-8' అవకాశం ఉంటుంది. ప్రస్తుతం స్కాట్లాండ్ (+2.164) మూడు మ్యాచుల్లో 5 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. ఇప్పటికే ఆసీస్ (6 పాయింట్లు) తదుపరి దశకు చేరుకున్న సంగతి తెలిసిందే.
ホーム
/
వెస్టిండీస్
/
టీ20 ప్రపంచ కప్‌లో సూపర్-8కి చేరిన అఫ్గానిస్థాన్, వెస్టిండీస్ !
الجمعة، 14 يونيو 2024
cricket sports ఉగాండా టీ20 ప్రపంచ కప్‌లో సూపర్-8కి చేరిన అఫ్గానిస్థాన్ న్యూజిలాండ్ టోర్నీ నుంచి నిష్క్రమించింది పాపువా న్యూగినీ కూడా ఇంటిముఖం పట్టాయి వెస్టిండీస్
ليست هناك تعليقات:
إرسال تعليق