ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి 15 రోజుల్లోనే పరీక్షల్లో అవకతవకలు, ఉగ్రదాడులు వంటివి చోటుచేసుకున్నాయని.. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మాత్రం తన ప్రభుత్వాన్ని కాపాడుకునే పనిలో నిమగ్నమయ్యారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విమర్శించారు. కేంద్ర సర్కారు రాజ్యాంగంపై దాడి చేస్తోందని ఆరోపిస్తూ దీనిని ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించబోమని 'ఎక్స్' వేదికగా పేర్కొన్నారు. అంతకుముందు పార్లమెంటు ప్రాంగణంలోనూ రాహుల్ ఇదే విధమైన వ్యాఖ్యలు చేశారు. ''రాజ్యాంగంపై దాడి ఆమోదయోగ్యం కాదు. రాజ్యాంగాన్ని ఏ శక్తి తాకలేదు. మేం దానిని కాపాడతాం. ఈ విషయంలో మా సందేశం ప్రజల వద్దకూ చేరుతోంది'' అని మీడియాతో రాహుల్ పేర్కొన్నారు. అనంతరం 'ఎక్స్' వేదికగా ఎన్డీయే సర్కారుపై విమర్శలు గుప్పించారు. ''అధికారంలోకి వచ్చిన 15 రోజుల్లోనే రైలు ప్రమాదాలు, కశ్మీర్‌లో ఉగ్రదాడులు, నీట్, యూజీసీ నెట్ పరీక్షల వివాదాలు, పాలు, గ్యాస్, టోల్ ధరల పెంపు, కార్చిచ్చులు, నీటి సంక్షోభం, వడదెబ్బ మరణాల వంటివి చోటుచేసుకున్నాయి'' అని ట్వీట్ చేశారు.
ప్రభుత్వాన్ని కాపాడుకోవడంలోనే ప్రధాని బిజీగా ఉన్నారు !
الاثنين، 24 يونيو 2024
'ఎక్స్' వేదికగా పేర్కొన్నారు national కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కేంద్ర సర్కారు రాజ్యాంగంపై దాడి చేస్తోందని ప్రభుత్వాన్ని కాపాడుకోవడంలోనే ప్రధాని బిజీగా ఉన్నారు
ليست هناك تعليقات:
إرسال تعليق