భారాస అధినేత, తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ హైకోర్టును ఆశ్రయించారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమ సమయంలో రైల్ రోకో సందర్భంగా తనపై నమోదైన కేసు విషయంలో ఆయన పిటిషన్ దాఖలు చేశారు. ప్రజా ప్రతినిధుల కోర్టులో తనపై ఉన్న కేసును కొట్టివేయాలని కోరారు. తెలంగాణ ఉద్యమంలో భాగంగా 2011 అక్టోబర్‌లో రైల్ రోకోకు కేసీఆర్ పిలుపునిచ్చారంటూ మల్కాజ్‌గిరి పోలీసులు కోర్టుకు నివేదిక సమర్పించారు. దీంతో పలు రైళ్ల రాకపోకలకు, రైల్వే ఉద్యోగులకు ఆటంకం కలిగించారని పేర్కొన్నారు. దీనిపై స్పందించిన కేసీఆర్.. ఎలాంటి రైల్ రోకోకు పిలుపునివ్వలేదని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఎవరో ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా కేసులు నమోదు చేశారన్నారు. రైల్ రోకో ఘటన తర్వాత మూడేళ్లకు తెలంగాణ ఏర్పడిందని, ఈ కేసుకు ఎలాంటి బలం లేదని తెలిపారు.
హైకోర్టును ఆశ్రయించిన కేసీఆర్ !
الاثنين، 24 يونيو 2024
telangana తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమ సమయంలో రైల్ రోకో సందర్భంగా తనపై నమోదైన కేసు హైకోర్టును ఆశ్రయించిన కేసీఆర్
ليست هناك تعليقات:
إرسال تعليق