రోడ్లు, రహదారుల అభివృద్ధి కోసం కేంద్రం ప్రవేశపెట్టిన 'భారత్ మాల' స్థానంలో కొత్త విధానం రాబోతోందని తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు. ఢిల్లీలో పర్యటిస్తోన్న ఆయన కేంద్రమంత్రి నితిన్ గడ్కరీతో భేటీ అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలోని జాతీయ రహదారుల అభివృద్ధి, తదితర అంశాలపై చర్చించినట్లు చెప్పారు. ''హైదరాబాద్-విజయవాడ హైవేను 6 లైన్ల రహదారిగా మార్చాలని కోరాం. ఉప్పల్-ఘట్‌కేసర్ మధ్య రహదారి 40 శాతమే పూర్తయింది. ఈ విషయం మంత్రి వద్ద ప్రస్తావించగా రహదారి పనులు త్వరగా పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఉప్పల్-ఘట్‌కేసర్ ఫ్లైఓవర్ టెండర్లు రద్దు చేసి కొత్త టెండర్లు పిలవాలని గడ్కరీ ఆదేశించారు. మంగళవారం కేంద్రమంత్రులు కిషన్‌రెడ్డి, భూపేంద్ర యాదవ్‌ను కలిసేందుకు అపాయింట్‌మెంట్ కోరాం'' అని మంత్రి కోమటిరెడ్డి తెలిపారు.
భారత్‌మాల స్థానంలో కొత్త విధానం రాబోతోంది !
الاثنين، 24 يونيو 2024
national telangana కేంద్రమంత్రి నితిన్ గడ్కరీతో భేటీ తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి భారత్‌మాల స్థానంలో కొత్త విధానం రాబోతోంది
ليست هناك تعليقات:
إرسال تعليق