సినీ నిర్మాత బండ్ల గణేశ్ సినీ నటి రోజాను ఉద్దేశించి తన అధికారిక ఎక్స్ ఖాతాలో ఒక పోస్ట్‌పెట్టారు. నగరి అసెంబ్లీ స్థానం నుంచి వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేగా బరిలో దిగిన రోజా.. ఓటమి అంచుల్లో ఉన్నారు. ఓటమి ఖాయమని దాదాపు తేలిపోయింది. దాంతో ఆమె తన అనుచరులతో కలిసి తిరుపతిలోని కౌంటింగ్ కేంద్రం నుంచి బయటికి వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలో బండ్ల గణేశ్ ఆమెను ఉద్దేశించి తన ఎక్స్ ఖాతాలో ఒక చమత్కార పోస్టు చేశారు. 'జబర్దస్త్ పిలుస్తోంది రా.. కదలిరా..@RojaSelvamaniRK' అనే టెక్స్ట్ పెట్టి, దానికి రోజా డ్యాన్స్ ఫోజుతో దిగిన ఫొటోను షేర్ చేశారు. బండ్ల గణేశ్ చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నెటిజన్‌ల నుంచి రకరకాల కామెంట్లు వస్తున్నాయి.
రోజా ఫొటోతో పెట్టిన బండ్ల గణేశ్ 'ఎక్స్' పోస్ట్ వైరల్ !
الثلاثاء، 4 يونيو 2024
'జబర్దస్త్ పిలుస్తోంది రా.. కదలిరా..@RojaSelvamaniRK' Andhra Pradesh రోజా డ్యాన్స్ ఫోజుతో దిగిన ఫొటోను షేర్ రోజా ఫొటోతో పెట్టిన బండ్ల గణేశ్ 'ఎక్స్' పోస్ట్ వైరల్
ليست هناك تعليقات:
إرسال تعليق