ఆంధ్రప్రదేశ్ లో టిడిపి ఓడిపోతుందని జోష్యం చెప్పిన వేణు స్వామి తాజాగా ఒక సందేశాన్ని రిలీజ్ చేశారు. తాను చెప్పిన లెక్క తప్పిందని, ఏపీలో వైసీపీ ఓటమి పాలైందని వేణు స్వామి పేర్కొన్నారు. తాను జాతకాన్ని అనుసరించి మాత్రమే తన జ్యోతిష్య అంచనా చెప్పానని పేర్కొన్న వేణు స్వామి, తాను దేశంలో ఎన్డీఏ కూటమి ప్రాభవం తగ్గుతుందని చెప్పానని, అలాగే ఏపీలో వైసీపీ విజయం సాధిస్తుందని చెప్పానని పేర్కొన్నారు. అయితే తాను చెప్పినట్టే దేశంలో ఎన్డీఏ కూటమి ప్రాభవం తగ్గిందని, ఇక తాను వైసీపీ అధికారంలోకి వస్తుందని చెప్పానని ఈ విషయంలో తన లెక్క తప్పిందన్నారు. కచ్చితంగా తాను చెప్పిన లెక్క తప్పిందని ఒప్పుకుంటున్నాను అని, చంద్రబాబు నాయుడు గారికి శుభాకాంక్షలు చెబుతున్నానని పేర్కొన్నారు. తన జ్యోతిష్య అంచనా తప్పినందుకు క్షమాపణలు చెబుతున్నానని తెలిపిన వేణు స్వామి తనకు ఉన్న విద్యను అనుసరించి జాతకాల ఫలితంగా, రాశుల ఫలితంగా మాత్రమే తాను జ్యోతిష శాస్త్ర అంచనాలు చెప్పానని వెల్లడించారు.
క్షమాపణలు చెప్పిన వేణు స్వామి !
الثلاثاء، 4 يونيو 2024
Andhra Pradesh telangana ఎన్డీఏ కూటమి ప్రాభవం తగ్గుతుందని చెప్పానని ఏపీలో వైసీపీ ఓటమి పాలైందని క్షమాపణలు చెప్పిన వేణు స్వామి తాను చెప్పిన లెక్క తప్పిందని
ليست هناك تعليقات:
إرسال تعليق