ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పపన్ కళ్యాణ్ తిరుగులేని మెజారిటీతో పిఠాపురంలో గెలుపొందారు. హైదరాబాద్‌లో పవన్ కల్యాణ్ నివాసం వద్దకు పెద్ద సంఖ్యలో అభిమానులు చేరుకున్నారు. వారందరికీ పవన్ భార్య అన్నాలెజినోవా, కుమారుడు అకీరాలు ధన్యవాదాలు తెలుపుతూ అభివాదం చేశారు. ఆ వీడియో కూడా ఎక్స్‌లో వైరల్‌గా మారింది. ఈ నేపథ్యంలోనే తాజాగా దీనిపై ఆయన మాజీ భార్య రేణూ దేశాయ్ పెట్టిన పోస్ట్ వైరల్‌గా మారింది. 'ఆద్య, అకీరాలు ఎంతో సంతోషంగా ఉన్నారు. ఈ తీర్పు వల్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా ప్రయోజనం పొందుతారని ఆశిస్తున్నా' అంటూ ఆద్య ఆనందంగా ఉన్న ఫొటోలను పంచుకున్నారు. ఈ పోస్ట్‌ను నెటిజన్లతో పాటు పవన్ అభిమానులు షేర్ చేస్తున్నారు.
పవన్ కల్యాణ్ గెలుపుపై రేణూ దేశాయ్ పోస్ట్ వైరల్ !
الثلاثاء، 4 يونيو 2024
Andhra Pradesh telangana కుమారుడు అకీరాలు అభివాదం పవన్ కల్యాణ్ గెలుపుపై రేణూ దేశాయ్ పోస్ట్ వైరల్ భార్య అన్నాలెజినోవా హైదరాబాద్‌లో పవన్ కల్యాణ్ నివాసం వద్ద సందడి
ليست هناك تعليقات:
إرسال تعليق