హైదరాబాద్, పాతబస్తీ పురానీ హవేలీలోని ఎస్కే ఫుట్వేర్ షాపులో బుధవారం సాయంత్రం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. విద్యుత్ షాక్ కారణంగా ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తుంది. ఈ ప్రమాదంలో సుమారు రూ. 50 లక్షల విలువైన ఆస్తి నష్టం జరిగింది. చెప్పులు, ముడి సరుకు పూర్తిగా కాలి బూడిదైంది. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది కలిసి మంటలను అదుపు చేశారు. చెప్పుల దుకాణం కావడంతో మంటలు క్షణాల్లో వ్యాపించాయి. దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. దీంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
పాతబస్తీలో భారీ అగ్నిప్రమాదం !
الأربعاء، 12 يونيو 2024
hyderabad telangana పాతబస్తీలో భారీ అగ్నిప్రమాదం పురానీ హవేలీలోని ఎస్కే ఫుట్వేర్ షాపులో రూ. 50 లక్షల విలువైన ఆస్తి నష్టం విద్యుత్ షాక్ కారణంగా
ليست هناك تعليقات:
إرسال تعليق