మెరికాలో తప్పుడు పత్రాలతో అడ్మిషన్‌ పొందిన ఓ భారతీయ విద్యార్థి స్కాలర్‌షిప్ కోసం ఏకంగా తన తండ్రి చనిపోయినట్లు ధృవీకరణ పత్రం సృష్టించడం గమనార్హం. ఈ విషయాన్ని గుర్తించిన అక్కడి అధికారులు అతడిపై బహిష్కరణ వేటు వేశారు. త్వరలోనే స్వదేశానికి పంపించనున్నారు. భారత్‌కు చెందిన ఆర్యన్‌ ఆనంద్‌ 2023 ఆగస్టులో పెన్సిల్వేనియాలోని యూనివర్సిటీ ఆఫ్‌ లేహీలో అడ్మిషన్‌ పొందాడు. ఈ క్రమంలో తప్పుడు ధృవపత్రాలు సమర్పించాడు. పదో తరగతి పరీక్ష ఫలితాలనూ ఫోర్జరీ చేసిన అతడు, పూర్తి స్కాలర్‌షిప్‌ కోసం అక్రమ మార్గాలను ఆశ్రయించాడు. తండ్రి బతికే ఉన్నప్పటికీ ఆయన చనిపోయినట్లు తప్పుడు మరణ ధ్రువీకరణ పత్రం సృష్టించాడు. ఇలా ఏడాది గడిచింది. ఈ క్రమంలో 'అసత్యాలతోనే నా జీవితం మొత్తాన్ని నిర్మించుకున్నాను' అంటూ సోషల్‌ మీడియాలో తన గురించి ప్రగల్భాలు పలుకుతూ ఓ పోస్టు పెట్టాడు. పదో తరగతి బోర్డు ఫలితాలను తారుమారు చేసిన తీరు, తప్పుడు ధృవపత్రాలతో అమెరికా కాలేజీలో చేరిన తీరును పేర్కొన్నాడు. అనంతరం చదువుపై ఆసక్తి కోల్పోవడం, స్కాలర్‌షిప్‌ కోసం పరీక్షల్లో మోసాలకు పాల్పడటం, తప్పుడు ఇంటర్న్‌షిప్‌ల గురించి వివరించాడు. ఈ విషయం అక్కడి అధికారుల దృష్టికి వెళ్లింది. దీంతో జూన్‌ 12న ఆనంద్‌ను అరెస్టు చేశారు. ఈ కేసులో దాదాపు 20 ఏళ్ల వరకు శిక్షపడే అవకాశం ఉంది. అయితే, యూనివర్సిటీ అధికారుల అభ్యర్థన మేరకు అతడిపై బహిష్కరణ వేటు వేశారు.

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ