పార్లమెంట్ ఉభయ సభలు సోమవారానికి వాయిదా పడ్డాయి. రాజ్యసభ ప్రారంభం కాగానే బిజెపి ఎంపి సుధాన్షు త్రివేది రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. అయితే లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడిన నీట్ పరీక్షపై చర్చ జరపాలంటూ ప్రతిపక్ష సభ్యులు నినాదాలు చేయడంతో పాటు వెల్‌లోకి దూసుకెళ్లారు. అయితే నీట్‌పై చర్చ జరిపేందుకు తాము సిద్ధమని కేంద్రం ప్రకటించింది. నీట్ వివాదంపై జెడి(ఎస్) ఎంపి, మాజీ ప్రధాని దెవెగౌడ కేంద్ర ప్రభుత్వానికి మద్దతు పలికారు. లోక్‌సభ సమావేశమైన కొన్ని నిమిషాలకే సోమవారానికి వాయిదా పడింది. అన్ని వ్యవహారాలను సస్పెండ్ చేయాలని, నీట్‌పై చర్చ జరపాలని, వాయిదా తీర్మానాన్ని ఆమోదించాలని ప్రతిపక్షాలు పట్టుబట్టాయి. అయితే నీట్‌పై చర్చకు అనుమతించలేమని స్పీకర్ ఓం బిర్లా తెలిపారు. గందరగోళం కొనసాగడంతో స్పీకర్ సభను సోమవారానికి వాయిదా వేశారు. రాజ్యసభ మొదట 2.00 గంటల వరకు వాయిదా పడింది. అనంతరం సభ ప్రారంభమైన కొన్ని నిమిషాలకు మరో అరగంట వాయిదా పడింది. నీట్‌పై చర్చ జరపాలని ప్రతిపక్షాలు నినాదాలు చేయడంతో రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్‌కర్ సభను సోమవారానికి వాయిదా వేశారు.
పార్లమెంట్ ఉభయ సభలు సోమవారానికి వాయిదా
الجمعة، 28 يونيو 2024
national నీట్ పరీక్షపై చర్చ జరపాలంటూ ప్రతిపక్ష సభ్యులు నినాదాలు నీట్‌పై చర్చ జరిపేందుకు తాము సిద్ధమని కేంద్రం పార్లమెంట్ ఉభయ సభలు సోమవారానికి వాయిదా
ليست هناك تعليقات:
إرسال تعليق