ప్రధాని మోడీని పవన్‌తో అకీరా కలిసిన విషయం తెలిసిందే. దీనిపై రేణు దేశాయ్ ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. 'నాకు మొదటి నుంచి భాజపా అంటే అభిమానం. మోడీ పక్కన నా కుమారుడిని చూస్తుంటే ఎంతో ఆనందంగా, ఎమోషనల్‌గా ఉంది. దానిని మాటల్లో వర్ణించలేను. మోడీ గారిని కలిశాక అకీరా నాకు ఫోన్ చేసి తన అనుభూతిని పంచుకున్నాడు. ఆయన చాలా గొప్ప వ్యక్తి అని. తన చుట్టూ ఓ పాజిటివ్ వైబ్ ఉందని చెప్పాడు' అని రాసుకొచ్చారు. తాజాగా జరిగిన ఎన్డీయే కూటమి నేతల సమావేశానికి పవన్ తన కుటుంబంతో సహా హాజరయ్యారు. తన కుమారుడు అకీరాను సైతం ఢిల్లీకి తీసుకెళ్లారు. కూటమి నేతల భేటీ ముగిసిన అనంతరం మోడీకి తన కుటుంబాన్ని పరిచయం చేశారు. ఈ సందర్భంగా అకీరా ప్రధాని మోడీకి నమస్కరిస్తుండగా అతడి భుజంపై చేయి వేసి మోదీ మాట్లాడుతున్న ఫొటోలు వైరల్ అవుతున్నాయి. వీటినే ఇన్‌స్టాలో రేణూ దేశాయ్ పంచుకున్నారు.
మోడీ పక్కన నా కుమారుడిని చూస్తుంటే ఎంతో ఆనందంగా ఉంది !
الجمعة، 7 يونيو 2024
Andhra Pradesh telangana మాటల్లో వర్ణించలేను మోడీ పక్కన నా కుమారుడిని చూస్తుంటే ఎంతో ఆనందంగా ఉంది రేణు దేశాయ్ ఎమోషనల్ పోస్ట్
ليست هناك تعليقات:
إرسال تعليق