నీతా అంబానీ ప్రతిరోజూ ఉపయోగించే ప్రతి వస్తువు విలాసవంతంగా ఉంటుంది. తాజాగా నీతా అంబానీ అందంగా డిజైన్ చేసిన వాటర్ బాటిల్‌లో నీళ్లు తాగుతున్న ఫోటో వైరల్‌గా మారింది. ఈ వాటర్ బాటిల్, దానిలోని నీటి ధరపై చర్చలు మొదలయ్యాయి. ఈ వాటర్ బాటిల్ 24 క్యారెట్ బంగారంతో తయారు చేయబడింది. ఆ వాటర్ బాటిల్ ధర రూ.49 లక్షలు. నీతా అంబానీ తాగే నీళ్లను ‘ఆక్వా డి క్రిస్టలో ట్రిబ్యూటో ఏ మొడిగ్లియాని’ అంటారు. కస్టమర్ కోరుకున్న డిజైన్‌లో ప్రముఖ డిజైనర్ ఫెర్నాండో అల్టామిరానో రూపొందించిన బాటిల్‌లో ఈ నీటిని అందిస్తారు. ఈ సీసా 24 క్యారెట్ల బంగారు కవర్‌ను కలిగి ఉంది. ఇది ఫ్రాన్స్, ఫిజీ నుండి వచ్చిన సహజ నీటి బుగ్గ మరియు ఐస్‌లాండ్ నుండి హిమ నదీయ నీటి మిశ్రమం. ఒక్కో బాటిల్ ఖరీదు అక్షరాలు 49 లక్షలు. ఈ వాటర్ బాటిల్ 750 ఎంఎల్ నీటిని కలిగి ఉంది. ఈ బాటిల్ లోపల ఉన్న నీటిలో 5 గ్రాముల బంగారం కలుపుతారు. ఈ బ్రాండ్ వాటర్ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైనదిగా పేర్కొంటారు. చర్మం ప్రకాశవంతంగా కనిపించేలా ఈ బంగారు రేణువులు సహాయపడతాయని చెబుతున్నారు. నీతా అంబానీ గోల్డెన్ బాటిల్ నుండి నీళ్లు తాగుతున్న వైరల్ ఫోటో నిజం కాదు. ఈ ఫొటో మార్ఫింగ్ చేసినట్లు చెబుతున్నారు. మార్ఫింగ్ చేసిన ఈ ఫోటో ఆధారంగా ఆంగ్ల మీడియా ఈ వార్తను ప్రచురించింది. 2015 ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా నీతా అంబానీ సాధారణ వాటర్ బాటిల్‌లో నీళ్లు తాగుతున్న ఫోటో ఉంది. ఈ ఫోటోలోని బాటిల్ గోల్డ్ బాటిల్‌గా మారిపోయింది. నీతా అంబానీ దగ్గర ఖరీదైన టీ సెట్ ఉంది. ఇందులో రోజూ టీ తాగుతుంది.. ఇది జపాన్ ఆధారిత కంపెనీచే తయారు చేయబడింది. దీని ధర సుమారు రూ. 1.5 కోట్లు.
నీతా అంబానీ అత్యంత ఖరీదైన నీటిని తాగుతుందా ?
الجمعة، 7 يونيو 2024
business national నీతా అంబానీ అత్యంత ఖరీదైన నీటిని తాగుతుందా ? ప్రముఖ డిజైనర్ ఫెర్నాండో అల్టామిరానో రూపొందించిన బాటిల్ ఫోటో వైరల్ వాటర్ బాటిల్ 24 క్యారెట్ బంగారంతో తయారు చేయబడింది
ليست هناك تعليقات:
إرسال تعليق