బీజేపీ నేతలు చెబుతున్న మాటలనే ఎగ్జిట్ పోల్ అంచనాలు వెల్లడించాయని మధ్యప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ జితూ పట్వారీ అన్నారు. ఎగ్జిట్ పోల్స్‌లో ఎన్నో వ్యత్యాసాలున్నాయని, వీటిలో వాస్తవాలేంటనేది మరికొన్ని గంటల్లో వెల్లడికానున్నాయని చెప్పారు. బీజేపీ నేతలు చెబుతున్న తీరులోనే ఎగ్జిట్ పోల్స్ వెల్లడికావడమంటే కాషాయ నేతలకు అనుకూలంగా వీటిని ఏమార్చారని అర్ధమవుతున్నదని వ్యాఖ్యానించారు. బీజేపీ నాలుగు సీట్లు గెలుచుకునే చోట ఎగ్జిట్ పోల్స్ ఆరు సీట్లు చూపాయని, ఆ పార్టీ మూడు స్ధానాల్లో పోటీ చేసిన చోట ఆరు సీట్లు గెలుస్తుందని చూపారని జితూ పట్వారీ ఆక్షేపించారు. భోపాల్‌లో సోమవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మధ్యప్రదేశ్‌లో తాము అత్యధిక స్దానాల్లో గెలిచే అవకాశాలున్నా తమ అంచనాలకు పూర్తి భిన్నంగా ఎగ్జిట్ పోల్స్ ఫలితాలున్నాయని అన్నారు. ఎగ్జిట్ పోల్స్‌తో తమ పార్టీ నైతిక స్ధైర్యం ఏమాత్రం దెబ్బతినలేదని స్పష్టం చేశారు. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 295 స్ధానాలు పైగా గెలుచుకుంటుందని చెప్పారు.
కాషాయ పార్టీ కనుసన్నల్లో ఎగ్జిట్ పోల్స్ !
الاثنين، 3 يونيو 2024
national కాషాయ పార్టీ కనుసన్నల్లో ఎగ్జిట్ పోల్స్ మధ్యప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ జితూ పట్వారీ మధ్యప్రదేశ్‌లో తాము అత్యధిక స్దానాల్లో గెలిచే అవకాశాలున్నా
ليست هناك تعليقات:
إرسال تعليق