కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాపై చేసిన ఆరోపణలకు తగిన సాక్ష్యాలను చూపేందుకు మరికొన్ని రోజుల గడువు కావాలని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ చేసిన విజ్ఞప్తిని ఎన్నికల సంఘం తిరస్కరించింది. ఆరోపణలకు సంబంధించిన సాక్ష్యాలను చూపించి తీరాలని స్పష్టం చేసింది. అందుకు నేటి సాయంత్రం 7 గంటలకు వరకు డెడ్‌లైన్ విధించింది. లేదంటే తగు చర్యలు తప్పవని హెచ్చరించింది. ''బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్న మీరు ఈ విధంగా ఆరోపణలు చేయడం ప్రజల్లో అనేక సందేహాలను రేకెత్తిస్తాయి. వాటిపై విచారణ జరిపేందుకు ఆదివారం వరకు తగిన ఆధారాలు సమర్పించాలి'' అని పేర్కొంటూ ఎన్నికల సంఘం జైరాం రమేశ్‌కు నోటీసులు పంపించింది. ఆదివారం సాయంత్రం లోగా వివరణ ఇవ్వాలని పేర్కొంది. అయితే, ఆధారాలను సమర్పించేందుకు తనకు వారం రోజుల వ్యవధి కావాలని జైరాం రమేశ్ ఈసీకి విజ్ఞప్తి చేశారు. ''లోక్‌సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు ముందు కేంద్రమంత్రి అమిత్ షా ఇప్పటివరకు 150 మంది కలెక్టర్లతో మాట్లాడారు. వారిపై నిఘా పెట్టి బెదిరింపులకు పాల్పడ్డారు. విజయం పట్ల కాషాయ పార్టీకి ఆందోళన పట్టుకుంది. ఆ పార్టీ నిరాశలో ఉందని దీని ద్వారా స్పష్టం అవుతుంది. ఏది ఏమైనా ఇండియా కూటమి విజయం సాధిస్తుంది'' అని 'ఎక్స్' (ట్విటర్) వేదికగా జైరాం రమేశ్ చేసిన పోస్టుపై ఈసీ తీవ్రంగా పరిగణించింది.
జైరాం రమేశ్ విజ్ఞప్తిని తిరస్కరించిన ఎన్నికల సంఘం !
الاثنين، 3 يونيو 2024
national జైరాం రమేశ్ విజ్ఞప్తిని తిరస్కరించిన ఎన్నికల సంఘం బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్న మీరు ఈ విధంగా ఆరోపణలు చేయడం తగదు మరికొన్ని రోజుల గడువు కావాలి
ليست هناك تعليقات:
إرسال تعليق