ప్రతిపక్ష పార్టీల నేతృత్వంలోని ఇండియన్ నేషనల్ డెవలప్‌మెంటల్ ఇన్‌క్లూజివ్ అలయన్స్ (ఇండియా) కూటమి నేతలు శనివారం ఢిల్లీలో సమావేశమయ్యారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే నివాసంలో ఈ భేటీ జరిగింది. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, ఆ పార్టీ కీలక నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా, ఎన్సీపీ (ఎస్పీ) చీఫ్ శరద్ పవార్, సీపీఎం నేత సీతారామ్ ఏచూరి, నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్సీ) అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా, సమాజ్ వాదీ పార్టీ (ఎస్పీ) చీఫ్ అఖిలేష్ యాదవ్, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్ సింగ్, ఆప్ ఎంపీ సంజయ్ సింగ్, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ తదితర నేతలు ఈ సమావేశానికి హాజరయ్యారు. కాగా, లోక్‌సభ ఎన్నికల చివరి దశ పోలింగ్, తుఫాన్ ప్రభావం కారణంగా తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) అధినేత్రి, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీతోపాటు తమిళనాడు సీఎం, డీఎంకే చీఫ్ ఎంకే స్టాలిన్ గైర్హాజరయ్యారు. అయితే డీఎంకే తరుఫున ఆ పార్టీ పార్లమెంటరీ నేత టీఆర్ బాలు సమావేశానికి హాజరయ్యారు. మరోవైపు లోక్‌సభ ఎన్నికలు ముగియడంతో కీలకమైన వ్యూహాత్మక సమావేశాన్ని ఇండియా బ్లాక్ నిర్వహించింది. జూన్ 4న ఫలితాల తర్వాత కూటమి భవిష్యత్తు కార్యాచరణపై నేతలు చర్చించారు. శనివారం సాయంత్రం టీవీల్లో జరిగే ఎగ్జిట్ పోల్స్ చర్చల్లో కూటమి పార్టీలు పాల్గొవాలని నిర్ణయించారు.
ఢిల్లీలో ఇండియా బ్లాక్ నేతల సమావేశం !
السبت، 1 يونيو 2024
national New Delhi ఇండియన్ నేషనల్ డెవలప్‌మెంటల్ ఇన్‌క్లూజివ్ అలయన్స్ ఢిల్లీలో ఇండియా బ్లాక్ నేతల సమావేశం మల్లికార్జున్ ఖర్గే నివాసంలో
ليست هناك تعليقات:
إرسال تعليق