ఆదోని ఎమ్మెల్యేగా గెలిచిన డాక్టర్ పార్థసారధి మీడియాతో మాట్లాడుతూ వైసీపీ చచ్చిన పాములాంటిది అని పేర్కొన్నారు. ఎన్నికల్లో తన వెంట నడిచిన బీజేపీ, టీడీపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు, అభిమానులకు పేరు పేరునా కృతజ్ఞతలు తెలిపారు. ఆదోనిలో అడుగుపెట్టిన నాటి నుంచి తన వెన్నంటి ఉండి, విజయానికి తోడ్పాటు అందించిన అందరికీ ధన్యవాదాలు చెప్పారు. అనంతరం ఆయన్ను కూటమి కార్యకర్తలు, అభిమానులుఎత్తుకుని విజయకేతనాన్ని ఎగురవేశారు. కూటమి గెలుపు ప్రజల గెలుపని, రాష్ట్ర అభివృద్ధి కోసం కృషి చేస్తామని ప్రజలకు తెలిపారు.
వైసీపీ చచ్చిన పాము లాంటిది !
الخميس، 6 يونيو 2024
Andhra Pradesh అభిమానులకు పేరు పేరునా కృతజ్ఞతలు ఆదోని ఎమ్మెల్యేగా గెలిచిన డాక్టర్ పార్థసారధి కార్యకర్తలు వైసీపీ చచ్చిన పాము లాంటిది
ليست هناك تعليقات:
إرسال تعليق