ఎన్నికల ముందు కొందరు వాలంటీర్లతో వైసీపీ నేతలు రాజీనామాలు చేయించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా మాజీ మంత్రి , వైసీపీ నేత కొడాలి నాని పై కేసు నమోదు అయ్యింది. పలువురు మాజీ వాలంటీర్లు ఆయనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమను వేధించి కొడాలి నాని తమతో బలవంతంగా రాజీనామా చేయించారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వాలంటీర్ల ఫిర్యాదు మేరకు కొడాలి నానిపై గుడివాడ పోలీసులు కేసు నమోదు చేశారు. కొడాలి నానితో పాటు ఆయన స్నేహితుడు వైసీపీ నేత దుక్కిపాటి శశిభూషణ్, గుడివాడ పట్టణ వైసీపీ అధ్యక్షుడు గొర్ల శ్రీను మరో ఇద్దరు వైసీపీ నేతలపై 447, 506 ఐపీసీ సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేసినట్లు సమాచారం.
కొడాలి నాని పై కేసు నమోదు !
الجمعة، 21 يونيو 2024
447 506 ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు Andhra Pradesh Criem కొడాలి నాని పై కేసు నమోదు కొందరు వాలంటీర్లతో వైసీపీ నేతలు రాజీనామాలు చేయించిన విషయం
ليست هناك تعليقات:
إرسال تعليق