ఆంధ్రప్రదేశ్ లోని బాపట్ల జిల్లా చీరాల మండలం ఈపూరుపాలెం రైల్వే పట్టాల సమీపంలో యువతి మృతదేహం లభ్యమయింది. యువతిని అత్యాచారం చేసి హత్య చేసినట్లు తెలుస్తోంది. డెడ్ బాడీని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. యువతి ఒంటి పైన కొట్టిన దెబ్బలు ఉన్నట్లు సమాచారం. సంఘటన స్థలాన్ని పరిశీలించిన జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్.. బాధిత యువతి నెల్లూరు జిల్లా వాసిగా గుర్తించారు. ఈ హత్యపై స్పందించిన సీఎం చంద్రబాబు నాయుడు హత్య జరిగిన ప్రాంతానికి వెళ్లాలని హోంమంత్రి వంగలపూడి అనితను ఆదేశించారు. వెంటనే ఘటన ప్రాంతానికి వెళ్లి బాధిత కుటుంబాన్ని కలవాలని సూచించారు. ప్రభుత్వం తరపున మృతురాలు కుటుంబానికి అండగా ఉండాలన్న సీఎం.. నిందితులను తక్షణమే అరెస్టు చేసి వేగవంతంగా దర్యాప్తు చేసి నిందితులకు కఠిన శిక్ష పడేలా చూడాలన్నారు. దర్యాప్తులో అలసత్వం లేకుండా జాప్యం జరగకుండా చూడాలని హెచ్చరించారు. సిఎం ఆదేశాలతో హత్య జరిగిన ఈపూరు పాలెం హోంమంత్రి అనిత బయలు దేరారు.
ఆంధ్రప్రదేశ్ లో యువతి దారుణ హత్య !
الجمعة، 21 يونيو 2024
Criem అత్యాచారం చేసి హత్య చేసినట్లు ఆంధ్రప్రదేశ్ లో యువతి దారుణ హత్య ఒంటి పైన కొట్టిన దెబ్బలు బాపట్ల జిల్లా చీరాల మండలం ఈపూరుపాలెం రైల్వే పట్టాల సమీపంలో
ليست هناك تعليقات:
إرسال تعليق