పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో జనసేనాని పవన్ కల్యాణ్ విజయం పట్ల టాలీవుడ్ అగ్ర కథానాయకుడు వెంకటేశ్ స్పందించారు. 'ప్రియమైన పవన్ కల్యాణ్… చారిత్రక విజయం సాధించినందుకు కంగ్రాచ్యులేషన్స్. ఇంతటి ఘన విజయాన్ని అందుకోవడానికి నీకంటే అర్హులెవరూ లేరు మిత్రమా. నువ్వు మరింత ఉన్నత శిఖరాలకు ఎదగాలని, ఇకమీదట కూడా నీ కఠోర శ్రమతో, నీ శక్తితో, ప్రజలకు సేవ చేయాలన్న అంకితభావంతో స్ఫూర్తి కలిగిస్తూనే ఉండాలని కోరుకుంటున్నాను' అంటూ వెంకీ ట్వీట్ చేశారు.

Post a Comment

Previous Post Next Post