మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్ జిల్లా సిహోడా గ్రామానికి చెందిన నరేంద్ర చాదర్ రైల్వే ట్రాక్‌మెన్‌గా పని చేస్తున్నాడు. బుధవారం ఉదయం అతడితోపాటు భార్య, ఇద్దరు కుమార్తెల మృతదేహాలను రైలు పట్టాలపై పోలీసులు గుర్తించారు. నరేంద్ర బైక్ రైలు పట్టాల సమీపంలో పార్క్ చేసి ఉండటాన్ని గమనించారు. ఈ నేపథ్యంలో ఆ కుటుంబం రైలు ముందు దూకి ఆత్మహత్యకు పాల్పడి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. నరేంద్ర, అతడి భార్య రీనా, మూడు, ఆరేళ్ల వయస్సున్న ఇద్దరు కుమార్తెల మృతదేహాలను గుర్తించారు. సూసైడ్‌తో పాటు అన్ని కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా, కుమార్తె రీనా మంగళవారం తనకు ఫోన్ చేసిందని ఆమె తండ్రి శంకర్ లాల్ తెలిపాడు. అత్తతో గొడవ జరిగినట్లు కుమార్తె చెప్పిందన్నాడు. కుటుంబంలో జరిగే సాధారణ వివాదంగా తాను భావించినట్లు తెలిపాడు. అయితే పిల్లలతో కలిసి అల్లుడు, కుమార్తె ఇలాంటి దారుణ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసి షాక్ అయ్యానని మీడియాతో అన్నాడు.
0 Comments