తెలంగాణ ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో రామోజీ గ్రూపు సంస్థల ఛైర్మన్ రామోజీరావు అంత్యక్రియలు పూర్తిచేశారు. గౌరవ సూచకంగా పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు. రామోజీ ఫిల్మ్‌సిటీలోని విశాలమైన ప్రాంతంలో ఆయన నిర్మాణం చేయించుకున్న ఆ స్మృతి కట్టడం వద్దే అంతిమ సంస్కారాలు పూర్తిచేశారు. రామోజీరావు చితికి కుమారుడు, ఈనాడు ఎండీ సీహెచ్ కిరణ్ నిప్పంటించారు. రామోజీ గ్రూపు సంస్థల సిబ్బంది, అభిమానుల 'జోహార్ రామోజీరావు' నినాదాల మధ్య అంత్యక్రియలు ముగిశాయి. అంత్యక్రియల్లో తెదేపా అధినేత చంద్రబాబు, నారా లోకేశ్‌తో పాటు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు పాల్గొన్నారు. సుప్రీంకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, తెలంగాణ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు, సీతక్కతో పాటు భాజపా ఎంపీలు కిషన్‌రెడ్డి, బండి సంజయ్ తదితరులు హాజరయ్యారు. ఏపీ నుంచి కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి, ఎమ్మెల్యేలు ప్రత్తిపాటి పుల్లారావు, చింతమనేని ప్రభాకర్, రఘురామకృష్ణరాజు, అరిమిల్లి రాధాకృష్ణ, వెనిగండ్ల రాము, పలువురు తెదేపా నేతలు పాల్గొన్నారు.
ముగిసిన రామోజీరావు అంత్యక్రియలు !
الأحد، 9 يونيو 2024
Andhra Pradesh telangana ముగిసిన రామోజీరావు అంత్యక్రియలు విధ రంగాలకు చెందిన ప్రముఖులు పాల్గొన్నారు స్మృతి కట్టడం వద్దే అంతిమ సంస్కారాలు
ليست هناك تعليقات:
إرسال تعليق