ఆంధ్రప్రదేశ్ లో చంద్రన్న బీమాకు సంబంధించి కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ తాజాగా ప్రకటన చేశారు. ఇంట్లో కుటుంబ పెద్ద చనిపోతే ఆ కుటుంబాన్ని ఆదుకునేందుకు తీసుకువచ్చిన బీమా పథకం సొమ్మును మూడు లక్షల నుంచి పది లక్షలకు పెంచుతున్నట్లు మంత్రి తాజాగా ప్రకటించారు. కార్మికులతో పాటు, మీడియా ప్రతినిధులు , లాయర్లను కూడా ఈ బీమా పథకం కిందకు తెచ్చే ఆలోచనలో ఉన్నామని, గత వైసిపి పాలనలో చంద్రన్న బీమా పథకం పేరు మార్చారని , దీని కారణంగా ఎంతో మందికి పరిహారం అందలేదని, ఇప్పుడు కూటమి ప్రభుత్వం భీమా సొమ్మును మూడు నుంచి పది లక్షలకు పెంచింది అని మంత్రి సుభాష్ ప్రకటించారు. చంద్రన్న భీమా అందరికీ అందేలా చూస్తామని , ఏపీ వ్యాప్తంగా కార్మికులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. కార్మికులు కార్మిక శాఖలో రూ 15 కట్టి ఈ పథకంలో చేరవచ్చు అని మంత్రి తెలిపారు . ప్రమాదవశాత్తు మరణిస్తే 10 లక్షల పరిహారం అందుతుంది.
చంద్రన్న బీమా పథకం సొమ్ముపది లక్షలకు పెంపు !
الثلاثاء، 25 يونيو 2024
Andhra Pradesh కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ కుటుంబ పెద్ద చనిపోతే ఆ కుటుంబాన్ని ఆదుకునేందుకు తీసుకువచ్చిన బీమా పథకం చంద్రన్న బీమా పథకం సొమ్ముపది లక్షలకు పెంపు
ليست هناك تعليقات:
إرسال تعليق