Ad Code

జూలై 9న రెడ్ మీ 13 5జి స్మార్ట్ ఫోన్ ను విడుదల !


జూలై 9న రెడ్ మీ 13 5జి స్మార్ట్ ఫోన్ ను విడుదల చేయబోతున్నట్లు షియోమీ ప్రకటించింది. ఈ అప్ కమింగ్ షియోమీ స్మార్ట్ ఫోన్ ను 108MP కెమెరా మరియు స్నాప్ డ్రాగన్ ప్రొసెసర్ తో పాటు స్లీక్ అండ్ షైనీ డిజైన్ తో తీసుకొస్తున్నట్లు కంపెనీ ఆటపట్టిస్తోంది. రెడ్ మీ 12 5జి ఫోన్ నెక్స్ట్ జెనరేషన్ ఫోన్ రెడ్ మీ 13 5జి లాంచ్ డేట్ అనౌన్స్ చేసింది. ఈ ఫోన్ ను మార్కెట్ లో ప్రస్తుతం అందుబాటులో ఉన్న చాలా ఫోన్ లకు గట్టి పోటీగా తీసుకువస్తున్నట్లు కనిపిస్తోంది. ఎందుకంటే, ఈ ఫోన్ లాంచ్ కి ఇంకా రెండు వారలు ఉండగా ఈ ఫోన్ కీలకమైన ఫీచర్ లతో కంపెనీ టీజింగ్ మొదలు పెట్టింది. రెడ్ మీ 13 5జి స్మార్ట్ ఫోన్ ను క్రిస్టల్ గ్లాస్ డిజైన్ తో తీసుకు వస్తోందిట. ఇది చూడటానికి చాలా అందంగా మెరుస్తూ స్లీక్ గా కనిపిస్తోంది. ఈ ఫోన్ Snapdragon 4 Gen 2 తో వస్తుంది. ఈ ఫోన్ లో సన్నని అంచులు మరియు పంచ్ హోల్ డిజైన్ కలిగిన పెద్ద డిస్ప్లే వుంది. ఈ ఫోన్ లో 5030 mAh బిగ్ బ్యాటరీ మరియు 33W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ ఉన్నట్లు కూడా షియోమీ తెలిపింది. రెడ్ మీ 13 5జి స్మార్ట్ ఫోన్ అవుట్ ఆఫ్ ది బాక్స్ షియోమీ హైపర్ OS తో పని చేస్తుంది. ఈ ఫోన్ లో వెనుక 108MP మెయిన్ కెమెరా కలిగిన డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ వుంది. ఈ ఫోన్ డిస్ప్లే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 రక్షణలో ఉంటుంది. వెనుక కూడా గ్లాస్ ఉంటుంది.

Post a Comment

0 Comments

Close Menu