Ad Code

తెలుగు రాష్ట్రాల్లో భారీగా పెరిగిన జియో వినియోగదారులు !


రిలయన్స్‌ జియో మొబైల్ యూజర్లను ఆకట్టుకునేందుకు ఎప్పటికప్పుడూ అద్భుతమైన ఆఫర్లు, డేటా ప్లాన్లను ప్రవేశపెడుతోంది. ఇతర టెలికం నెట్‌వర్క్ సర్వీసులతో పోలిస్తే జియో అత్యధిక కస్టమర్లతో టాప్ ప్లేసులో కొనసాగుతోంది. ఇటీవల ట్రాయ్ విడుదల చేసిన టెలికాం సబ్‌స్ర్కైబర్ల గణాంకాల ప్రకారం రిలయన్స్ జియోలో 2024 ఏప్రిల్‌లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలతో కలిపి మొత్తంగా 1.56 లక్షలకు పైగా సబ్‌స్ర్కైబర్లు కొత్తగా చేరారు. ట్రాయ్ గణాంకాల ప్రకారం.. గత ఏప్రిల్ నెలలో జియో అత్యధికంగా 1,56,296 మంది మొబైల్ సబ్‌స్ర్కైబర్లను చేరుకుంది. తెలుగు రాష్ట్రాల్లో రిలయన్స్ జియో కస్టమర్ల సంఖ్య ఏప్రిల్ నెలాఖరకు 3.29 కోట్లకు చేరుకుంది. ఈ ఏప్రిల్‌లోనే మరో టెలికం దిగ్గజం ఎయిర్‌టెల్‌లో 55 వేల మంది కొత్త మొబైల్ సబ్‌స్ర్కైబర్లు వచ్చి చేరారు. మరోవైపు.. ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ లో 2.57 లక్షల మంది కస్టమర్లను భారీగా కోల్పోయింది. అతి పెద్ద టెలికం నెట్‌వర్క్ అయిన వోడాఫోన్ ఐడియా కూడా 23,456 మంది కస్టమర్లను భారీగా కోల్పోయింది. గత ఏప్రిల్‌ నుంచి దేశవ్యాప్తంగా రిలయన్స్ జియో ఆధిపత్యాన్ని ఇంకా కొనసాగిస్తూనే ఉంది. జియోలో 26.8 లక్షల మంది సబ్‌స్ర్కైబర్లు చేరారు. ఈ గణాంకాలను పరిశీలిస్తే.. ఏప్రిల్ 2024 నాటికి దేశంలో మొత్తంగా జియో మొబైల్ కస్టమర్ల సంఖ్య 47.24 కోట్లకు చేరింది. ఇందులో కొత్తగా 7.52 లక్షల కస్టమర్లు చేరగా, 26.75 కోట్ల మొత్తం యూజర్లతో ఎయిర్‌టెల్ తర్వాత స్థానంలో నిలిచింది. మొత్తం టెలికాం యూజర్ల సంఖ్య ఏప్రిల్ నాటికి 120 కోట్లను దాటేసింది.

Post a Comment

0 Comments

Close Menu