రాష్ట్రాలు రెండైనా తెలుగువారంతా ఒక్కటేనని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు ఏర్పాటై పదేళ్లు పూర్తయిన సందర్భంగా ఆయన ఎక్స్‌లో పోస్ట్ పెట్టారు. ''10 కోట్ల తెలుగు జాతి మేటిగా వెలగాలన్నదే నా ఆకాంక్ష. నాటి ఆర్థిక సంస్కరణల తర్వాత సంపద సృష్టికి బీజం పడింది. ప్రభుత్వ విధానాల ద్వారా సంక్షేమం, అభివృద్ధితో ప్రజల జీవితాల్లో మార్పులు మొదలయ్యాయి. నాలెడ్జ్ ఎకానమీతో అవకాశాలను అందిపుచ్చుకొని భారతీయులు, ముఖ్యంగా తెలుగు ప్రజలు అద్భుత ఫలితాలు సాధిస్తున్నారు. పేదరికం లేని సమాజం దిశగా రెండు రాష్ట్రాల ప్రయాణం సాగాలి. రానున్న రోజుల్లో ఆర్థిక అసమానతలను నిర్మూలించి.. సమగ్ర సాధికారత సాధించాలి. రెండు రాష్ట్రాలు ఏర్పడి పదేళ్లు అవుతున్న సందర్భంగా తెలుగు ప్రజల విజయాలు, కీర్తి ప్రపంచవ్యాప్తం కావాలి. భారతదేశం స్వాత్రంత్యం సాధించి వందేళ్లు పూర్తి అయ్యే 2047 నాటికి ప్రపంచంలో భారతీయులు.. అందులోనూ తెలుగు జాతి అగ్రస్థానంలో ఉండాలి''అని చంద్రబాబు పేర్కొన్నారు.
10 కోట్ల తెలుగు జాతి మేటిగా వెలగాలన్నదే నా ఆకాంక్ష !
الأحد، 2 يونيو 2024
10 కోట్ల తెలుగు జాతి మేటిగా వెలగాలన్నదే నా ఆకాంక్ష Andhra Pradesh telangana ఏపీ తెదేపా అధినేత చంద్రబాబు ఎక్స్‌లో పోస్ట్ తెలంగాణ రాష్ట్రాలు ఏర్పాటై పదేళ్లు పూర్తయిన సందర్భంగా
ليست هناك تعليقات:
إرسال تعليق