ముస్లింల ఓటు బ్యాంకు ముందు ఇండియా కూటమి అవసరమైతే ముజ్రా డ్యాన్స్ చేస్తుందంటూ ప్రధాని నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేషనల్ చీఫ్ మల్లికార్జున ఖర్గే మండిపడ్డారు. ఇలాంటి వ్యాఖ్యలు చేసి ప్రధాని బీహార్‌ను అవమానించారని పేర్కొన్నారు. ఇండియా కూటమి అభ్యర్థి మనోజ్ కుమార్ తరపున బీహార్‌లోని ససరంలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన సందర్భంగా ఖర్గే మాట్లాడుతూ ప్రధాని తనను తాను తీస్‌మార్‌ఖాన్ అనుకొంటున్నారని ఎద్దేవా చేశారు. అయితే ప్రజలే తీస్‌మార్‌ఖాన్‌లని గుర్తుంచుకోవాలన్నారు. మోడీ మూడోసారి ప్రధాని అయితే ప్రజలు ఏమీ మాట్లాడటానికి కూడా ఉండదన్నారు. ఈ లోక్‌సభ ఎన్నికలు ప్రజలు వర్సెస్ మోడీయే తప్ప రాహుల్ వర్సెస్ మోడీ కానే కాదన్నారు.
ముజ్రా డ్యాన్స్ వ్యాఖ్యలపై మల్లికార్జున ఖర్గే మండిపాటు !
الأحد، 26 مايو 2024
BJP congress national ప్రజలు వర్సెస్ మోడీయే తప్ప రాహుల్ వర్సెస్ మోడీ కానే కాదు ప్రధాని తనను తాను తీస్‌మార్‌ఖాన్ అనుకొంటున్నారని ఎద్దేవా ముజ్రా డ్యాన్స్ వ్యాఖ్యలపై మల్లికార్జున ఖర్గే మండిపాటు
ليست هناك تعليقات:
إرسال تعليق