ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా తాజాగా ఆయన స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీపై ప్రశంసలు కురిపించారు. ఐపీఎల్ ప్లేఆఫ్స్ కు అనూహ్యంగా దూసుకొచ్చిన బెంగళూరు జట్టు, కోహ్లీ కంటే స్ఫూర్తినిచ్చేవారు ఎవరుంటారని ప్రశంసించారు. ''పొరపాట్లు చేసినప్పుడు, కింద పడిపోయినప్పుడు వాటిని సరిదిద్దుకుని తిరిగి పైకి లేచే వ్యక్తులపై మా కంపెనీ విశ్వాసంగా ఉంటుంది. ఎలాంటి పరిస్థితుల్లోనైనా మన ప్రయత్నాన్ని వదిలిపెట్టొద్దు. అలాంటివారిని మేం ఎల్లప్పుడూ ప్రోత్సహిస్తాం. అభినందిస్తాం. ఈ మండే మోటివేషన్లో కింగ్ కోహ్లీ, బెంగళూరు కంటే మించి మనకు స్ఫూర్తి కలిగించేవారు ఇంకెవరున్నారు?'' అని మహీంద్రా రాసుకొచ్చారు. ప్రస్తుతం ఆయన పెట్టిన పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. దీనికి ప్రతిస్పందనగా 'సరిగ్గా చెప్పారు సర్' అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
కోహ్లీకి ఆనంద్ మహీంద్ర ప్రశంసలు !
الاثنين، 20 مايو 2024
business national sports ఐపీఎల్ ప్లేఆఫ్స్ కు అనూహ్యంగా దూసుకొచ్చిన బెంగళూరు జట్టు కోహ్లీకి ఆనంద్ మహీంద్ర ప్రశంసలు
ليست هناك تعليقات:
إرسال تعليق