హిమాచల్‌ప్రదేశ్‌లోని మండి లోక్‌సభ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి కంగనా రనౌత్‌కు చేదు అనుభవం ఎదురైంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవాళ లాహౌల్, స్పితి జిల్లాలోని కాజాకు వెళ్లిన కంగనా వాహనాన్ని అక్కడి కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకుని నల్ల జెండాలు ప్రదర్శిస్తూ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా కంగనా రనౌత్ వెంట హిమాచల్‌ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత ప్రతిపక్ష నేత జైరామ్ ఠాకూర్ కూడా ఉన్నారు. అయితే కంగనా వాహన శ్రేణికి అడ్డువచ్చిన కాంగ్రెస్ కార్యకర్తలను పోలీసులు అడ్డు తప్పించారు. అనంతరం కంగనా, జైరామ్ ఠాకూర్ సభా స్థలికి వెళ్లి ఆ సభలో ప్రసంగించారు. కంగనా రనౌత్ బరిలో ఉన్న మండి లోక్‌సభ స్థానానికి ఏడో దశ ఎన్నికల్లో భాగంగా జూన్ 1న పోలింగ్ జరగనుంది.
ホーム
/
జూన్ 1న పోలింగ్
/
కంగనా రనౌత్‌కు నిరసన సెగ !
الاثنين، 20 مايو 2024
Himachal Pradesh national కంగనా రనౌత్‌కు నిరసన సెగ కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకుని నల్ల జెండాలు ప్రదర్శిస్తూ నిరసన జూన్ 1న పోలింగ్
ليست هناك تعليقات:
إرسال تعليق