తెలంగాణాలో గ్రాడ్యుయేట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ అసత్య ప్రచారాలు, అబద్దపు హామీలు గుప్పించి కాంగ్రెస్ గద్దెను ఎక్కిందని కిషన్ రెడ్డి విమర్శించారు. అధికారంలోకి వచ్చిన ఐదు నెలల్లోనే ప్రజల్లో విశ్వాసం కోల్పోయిందని తెలిపారు. ఇచ్చిన హామీలను నెరవేర్చే శక్తి సీఎం రేవంత్రెడ్డికి లేదని, రాష్ట్రంలో రాజకీయ ప్రత్యామ్నాయం బీజేపీ మాత్రమేనని తెలిపారు. కేసీఆర్ లాగా కాలయాపన చేయడం రేవంత్ కి అలవాటుగా మారిందని విమర్శించారు. పార్లమెంట్ ఎన్నికల ఫలితాల అనంతరం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆ పార్టీలో ఉండే పరిస్థితి లేదని చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వార్డు మెంబర్ మొదలుకుని అన్ని పదవులకు బీజేపీ పోటీ చేస్తుందని, అందుకు స్థానిక నాయకులు సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలో బీఆర్ఎస్ అభ్యర్థి గెలిస్తే దానం, కడియం తరహాలో పార్టీ మారతాడని.. కాంగ్రెస్ అభ్యర్థి గెలిస్తే రేవంత్రెడ్డి జపం చేస్తాడని అన్నారు. బీజేపీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డిని గెలిపించాలని కోరారు.
అసత్య ప్రచారాలు, అబద్ధపు హామీలతో కాంగ్రెస్ గద్దెనెక్కింది !
الأحد، 19 مايو 2024
telangana అధికారంలోకి వచ్చిన ఐదు నెలల్లోనే ప్రజల్లో విశ్వాసం కోల్పోయిందని అబద్ధపు హామీలతో కాంగ్రెస్ గద్దెనెక్కింది అసత్య ప్రచారాలు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
ليست هناك تعليقات:
إرسال تعليق