తెలంగాణలోని  రాజన్న సిరిసిల్ల జిల్లా కోనారావుపేట మండటం వెంకట్రావుపేటలో ఉపాధి హామీ పనులు చేస్తుండగా మట్టిపెళ్లలు మీదపడి మార్పాక రాజవ్వ (45) మృతి చెందగా కర్ణాల లహరి, పల్లం దేవవ్వ, కర్నాల శ్యామల, ఎడ్ల రామవ్వ, వద్నాల అమృత, సందు చంద్రయ్య గాయపడ్డారు. స్థానికులు క్షతగాత్రులను హుటాహుటిన జిల్లా హాస్పిటల్‌కు తరలించారు. కాగా, విషయం తెలుసుకున్న జడ్పీ చైర్ పర్సన్ జడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణరాఘవ రెడ్డి హాస్పిటల్‌కు వెళ్లి క్షతగాత్రులను పరామర్శించారు. 

Post a Comment

Previous Post Next Post