ఆంధ్రప్రదేశ్ లోని పశ్చిమగోదావరి జిల్లాలోని తణుకు ఎన్టీఆర్ ప్రాథమిక పాఠశాలను పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్‌ప్రకాశ్ పరిశీలించిన సందర్భంగా మాట్లాడుతూ 'ప్రైవేటు పాఠశాలలతో పోలిస్తే పదో తరగతి ఉత్తీర్ణత శాతంలో ప్రభుత్వ బడులు 20 శాతం వెనుకబడి ఉన్నాయి. నిష్ణాతులైన ఉపాధ్యాయులున్నా పరీక్షల్లో నూరు శాతం ఫలితాలు సాధించకపోవడడానికి నిర్లక్ష్యమే కారణం. రూ. కోట్లు వెచ్చించి సౌకర్యాలు కల్పిస్తున్నా ఫలితాలు మెరుగుపడటం లేదు. ఉదయం ఆలస్యంగా వచ్చినా సాయంత్రం మాత్రం నిర్దేశిత సమయం కంటే ముందే వెళ్లిపోతున్నారు. ఒక్కో తరగతి ఉపాధ్యాయుడికి సగటున 20 నుంచి 25 మంది పిల్లలే ఉంటున్నారు. ఒక వాలంటీరు 50 ఇళ్లను చూస్తుంటే కనీసం ఒక ఉపాధ్యాయుడు 50 మంది పిల్లలను చూడలేరా? ఆరో తరగతి నుంచే పిల్లలకు ప్రతి యూనిట్‌లో 70 శాతం మార్కులు రావాలి. పిల్లల్లో అభ్యాసన సామర్థ్యాలు తక్కువగా ఉంటే దానిపై వారి తల్లిదండ్రులతో చర్చించాలి. మీకు జీతాలుగా ఇచ్చేది ఉచిత సొమ్ము కాదు... ప్రజలందరిదని గుర్తించుకోవాలి' అని పేర్కొన్నారు. మూడు నెలలుగా జీతాలు రాకపోవడంపై ఆయాలు ఆయన్ను కలవగా మూడు రోజుల్లో చెల్లిస్తామని హామీ ఇచ్చారు.
మీకు జీతాలుగా ఇచ్చేది ప్రజలందరిదని గుర్తించుకోవాలి !
الأحد، 19 مايو 2024
Andhra Pradesh నిష్ణాతులైన ఉపాధ్యాయులున్నా పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్‌ప్రకాశ్ మీకు జీతాలుగా ఇచ్చేది ప్రజలందరిదని గుర్తించుకోవాలి
ليست هناك تعليقات:
إرسال تعليق