మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న జేడీఎస్ సస్పెండెడ్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు ఆరు రోజుల పోలీస్ కస్టడీ విధించారు. ఈ మేరకు అశ్లీల వీడియో కేసుపై ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టు విచారణ అనంతరం ఆరురోజుల పోలీస్ కస్టడీకి అనుమతిచ్చింది. ఇక మైసూర్‌లోని కేఆర్ నగర్‌కు చెందిన మహిళ కిడ్నాప్ కేసులో ప్రజ్వల్ రేవణ్ణ, హెచ్‌డీ రేవణ్ణ బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఆయన బెయిల్‌ను వ్యతిరేకిస్తూ సిట్ కూడా హైకోర్టులో పిటిషన్ వేసింది. విచారణ పూర్తయ్యే వరకు రేవణ్ణ కస్టడీలోనే ఉండాలని, అందుకే బెయిల్‌ను రద్దు చేయాలని సిట్ హైకోర్టును కోరింది. దీనిపై విచారణను హైకోర్టు జూన్ 3కి వాయిదా వేసింది.
ప్రజ్వల్ రేవణ్ణకు ఆరు రోజుల పోలీస్ కస్టడీ విధింపు !
الجمعة، 31 مايو 2024
Criem karnataka national అశ్లీల వీడియో కేసు ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టు విచారణ అనంతరం ప్రజ్వల్ రేవణ్ణకు ఆరు రోజుల పోలీస్ కస్టడీ విధింపు
ليست هناك تعليقات:
إرسال تعليق