కేరళ లోని అలప్పుజ జిల్లా, పజవీడుకు చెందిన విశ్వంభరన్ సీఆర్‌పీఎఫ్‌లో పని చేసి రిటైర్ అయ్యాడు. ప్రస్తుతం సెక్యూరిటీ గార్డ్‌గా పని చేస్తున్నాడు. అయితే విశ్వంభరన్‌కు లాటరీ టికెట్లు కొనే అలవాటు ఉంది. ప్రతి నెల వాటి కోసం 500 రూపాయలు ఖర్చు చేస్తాడు. గత ఐదేళ్ల నుంచి లాటరీ టికెట్లు కొంటూ వస్తున్నాడు. ప్రతి సారి 20 టికెట్ల వరకు కొనేవాడు. కానీ ఈసారి మాత్రం పెద్ద మొత్తంలో లాటరీ టికెట్లు కొనుగోలు చేశాడు. ఈసారి అతడిని అదృష్టం వరించింది. లాటరీలో ఏకంగా 12 కోట్ల రూపాయలు గెలిచాడు. ఈ సందర్భంగా విశ్వంభరన్ మాట్లాడుతూ ''ఏదో ఒకరోజు లాటరీలో గెలుస్తాను అనే ఉద్దేశంతో గత ఐదేళ్లుగా వీటిని కొనుగోలు చేస్తూ వస్తున్నాను. ప్రతి సారి 20 టికెట్లు కొనేవాడిని. కానీ ఈసారి ఇంకా ఎక్కువ టికెట్లు కొనుగోలు చేశాను. వార్తల్లో అలప్పుజ జిల్లాకు చెందిన వ్యక్తి లాటరీ విన్ అయ్యాడు అని వచ్చింది. వెంటనే నా దగ్గర ఉన్న టికెట్లు బయటకు తీసి చెక్ చేసుకున్నాను. ఆశ్చర్యంగా లాటరీలో నేను కొన్న టికెట్‌కే ఫస్ట్ ఫ్రైజ్ తగిలింది. ముందు నేను నమ్మలేదు. ఒకటికి పది సార్లు చెక్ చేసుకున్నాను. అప్పుడు నాకు నమ్మకం కలిగింది. లాటరీలో నేను విన్ అయ్యాను, 12 కోట్ల రూపాయలు గెలుచుకున్నాను అని తెలిసింది. ఇదంతా దేవుడి దయ. ఈ మొత్తంతో నా అవసరాలు తీర్చుకుంటాను. మరీ ముఖ్యంగా ఇల్లు కట్టుకోవాలని భావిస్తున్నాను. దీనికన్నా పెద్ద కోరిక నాకేం లేదు'' అని చెప్పుకొచ్చాడు.
రూ.12 కోట్ల జాక్ పాట్ కొట్టిన కేరళ వాసి !
الجمعة، 31 مايو 2024
national ప్రస్తుతం సెక్యూరిటీ గార్డ్‌గా పని చేస్తున్నాడు రూ.12 కోట్ల జాక్ పాట్ కొట్టిన కేరళ వాసి విశ్వంభరన్ సీఆర్‌పీఎఫ్‌లో పని చేసి రిటైర్ అయ్యాడు
ليست هناك تعليقات:
إرسال تعليق