ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ స్వాతి మాలివాల్‌కు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా మద్దతుగా నిలిచారు. ఆమెకు జరిగిన సంఘటనపై మీడియాలో వచ్చిన కథనాలు చూసి తీవ్ర మనోవేదనకు గురైనట్లు ఆయన లేఖలో వెల్లడించారు. స్వాతి మాలివాల్‌కు ఎదురైన బాధాకరమైన అనుభవం, సహచర నేతల నుంచి ఎదురైన బెదిరింపులు, అవమానాలు చూసి చాలా ఆవేదన చెందినట్లు వీకే.సక్సేనా పేర్కొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేజ్రీవాల్ తీరును ఆయన తప్పుపట్టారు. ఈ ఘటనపై ఇప్పటివరకు కేజ్రీవాల్ స్పందించకపోవడాన్ని ప్రశ్నించారు. మాలివాల్‌ను శారీరక హింసకు గురిచేయడం క్షమించరాని నేరమని, ఆమోదయోగ్యం కాదని ఆయన పేర్కొన్నారు. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వ్యాఖ్యలను ఆమ్ ఆద్మీ పార్టీ ఖండించింది. బీజేపీ తొత్తులగా పని చేస్తున్నారని దుయ్యబట్టింది. ఆప్ మంత్రి అతిషి కూడా ఇటీవల మీడియాతో మాట్లాడుతూ.. స్వాతి మాలివాల్.. బీజేపీ ఏజెంట్‌గా అభివర్ణించారు. ఇక ఈ ఘటనపై కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ కూడా తీవ్రంగా తప్పుపట్టారు. కేజ్రీవాల్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
స్వాతి మాలివాల్‌కు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ మద్దతు !
الثلاثاء، 21 مايو 2024
national New Delhi కేజ్రీవాల్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ తీవ్ర మనోవేదనకు గురైనట్లు ఆయన లేఖలో వెల్లడి స్వాతి మాలివాల్‌కు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ మద్దతు
ليست هناك تعليقات:
إرسال تعليق