కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీ నిర్వహించిన విశేష్ సంపర్క్ కార్యక్రమంలో జొమాటో సీఈఓ దీపిందర్ గోయల్ పాల్గొని ప్రసంగిస్తూ స్టార్టప్‌ను ప్రారంభించాలని ఆలోచన వచ్చిన వెంటనే తన తండ్రితో ఆ విషయంపై చర్చించానని తెలిపారు. అది సాధ్యం కాని విషయమని, మనం చేయలేమని ఆయన అన్నారని గుర్తు చేసుకున్నారు. ''స్టార్టప్ ప్రారంభిస్తానని నాన్నకు చెప్పినప్పుడు ఆయన నీ తండ్రి స్థాయి ఏంటో తెలుసా అని ప్రశ్నించారు. ఇంత చిన్న ఊరిలో ఉన్న మనం ఏమీ చేయలేమని, అది సాధ్యం కాని పని అని అనుమానం వ్యక్తంచేశారు'' అని పేర్కొన్నారు. కాని ప్రభుత్వ సహకారంతో నాలాంటి చిన్న పట్టణానికి చెందిన కుర్రాడు కూడా జొమాటో వంటి సంస్థను స్థాపించగలడని నిరూపించానని తెలిపారు. 2008లో సంస్థను స్థాపించినప్పటి నుంచి నేటివరకు సంస్థ లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తోందని ఆనందం వ్యక్తంచేశారు. గోయల్ ప్రసంగానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కొన్ని నెలల క్రితం గోయల్ మోడల్ గ్రీసియా మునోజ్‌ను వివాహం చేసుకున్నారు. కటిక పేదరికం నుంచి లక్షల మందికి ఉపాధి కల్పించే స్థాయికి ఎదిగిన అతడి జీవన ప్రయాణం ఎందరో యువతకు స్ఫూర్తివంతంగా నిలుస్తుంది.
నీ తండ్రి స్థాయి ఏంటో తెలుసా అని మా నాన్న నన్ను ప్రశ్నించారు !
الثلاثاء، 21 مايو 2024
జొమాటో సీఈఓ దీపిందర్ గోయల్ నీ తండ్రి స్థాయి ఏంటో తెలుసా అని మా నాన్న నన్ను ప్రశ్నించారు విశేష్ సంపర్క్ కార్యక్రమం స్టార్టప్ ప్రారంభిస్తానని నాన్నకు చెప్పినప్పుడు
ليست هناك تعليقات:
إرسال تعليق