దేశంలో పార్సిల్ స్కామ్ నేరాలు ఎక్కువగా వెలుగులోకి వస్తున్నాయి. అనేక మంది లక్షల రూపాయలను కోల్పోతున్నారు. అధికారుల పేర్లు చెప్పి కాల్ చేసి అందినకాడికి దండుకుంటున్నారు. ఇందుకోసం సైబర్ క్రైం కోఆర్డినేషన్ సెంటర్, టెలికాం మంత్రిత్వ శాఖ రంగంలోకి దిగాయి. ఈ తరహా మోసపూరిత కాల్స్ ఎక్కువగా నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో. సీబీఐ, సహా ఇతర సంస్థల పేరుతో వస్తున్నట్లు గుర్తించారు. దీంతోపాటు అధికారిక లోగోలను దుర్వినియోగం కాకుండా చూసేందుకు మైక్రోసాఫ్ట్ సాయం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. నకిలీ స్కైప్ ఐడీలను క్రియేట్ చేసినట్లు అధికారులు గుర్తించారు. ఇందులో సుమారు 1500 ఐడీలపై ఫిర్యాదులు చేసినట్లు తెలుస్తోంది. ఈ రకమైన మోసాలు ఎక్కువగా సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలు సహా నేరుగా కాల్స్ చేస్తున్నట్లు గుర్తించారు. నేరగాళ్లు సీబీఐ, ఎన్‌ఐఏ సహా ఇతర బ్యాంకు అధికారుల పేరిట ఫోన్లు చేస్తున్నారు. బాధితుల పేరుతో డ్రగ్స్ వంటి నిషేధిత పదార్థాలు, నకిలీ పాస్‌పోర్టు లు సహా ఇతర అనుమానిత వస్తువులను గుర్తించినట్లు చెబుతున్నారు. దీంతో బాధితులు ఆందోళనకు గురవుతున్నారు. నేరగాళ్ల మాటలు నమ్మినవారిని కేసుల నుంచి బయటపడేసేందుకు అని చెప్పి నగదు డిమాండ్ చేస్తున్నారు. అనేక మార్గాల్లో నగదు బదిలీ చేయించుకుంటున్నారు. కొన్ని ఘటనల్లో బాధితులు నగదు బదిలీ చేసేంత వరకు వీడియో కాల్ లోనే ఉంచుతున్నారు. ఈ తరహా ఘటనల్లో విదేశీ నేరగాళ్ల హస్తం కూడా ఉందని కేంద్ర హోం శాఖ భావిస్తోంది. ఈ తరహా ఘటనల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం సూచించింది. సైబర్ క్రైం వెబ్ సైట్ ద్వారా ఇటువంటి కాల్స్, మెసెజ్, URL లపై ఫిర్యాదు చేయాలని సూచించింది. దీంతోపాటు ఎటువంటి ధ్రువీకరణ లేకుండా నగదు బదిలీ చేయవద్దని మరియు వ్యక్తిగత వివరాలను వెల్లడించవద్దని సూచించింది.
పార్సిల్ స్కామ్‌పై దృష్టిపెట్టిన ప్రభుత్వం ?
الاثنين، 27 مايو 2024
science technology టెలికాం మంత్రిత్వ శాఖ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో. సీబీఐ పార్సిల్ స్కామ్‌పై దృష్టిపెట్టిన ప్రభుత్వం ? రంగంలోకి సైబర్ క్రైం కోఆర్డినేషన్ సెంటర్ సహా ఇతర సంస్థల పేరుతో
ليست هناك تعليقات:
إرسال تعليق