దేశంలో డీప్‌ఫేక్ వ్యాప్తి కలవరపెడుతున్న సంగతి తెలిసిందే. అయితే, ఇలాంటి నకిలీలను గుర్తించేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వానికి చెందిన ప్రెస్ ఇన్‌ఫర్మేషన్ బ్యూరో తాజాగా ఓ వీడియో విడుదల చేసింది. ఎలాంటి టెక్నాలజీ అవసరం లేకుండా కేవలం చిన్న చిన్న అంశాలను ఉపయోగించి ఏఐతో సృష్టించే డీప్‌ఫేక్ ఫొటోలను గుర్తించొచ్చని చెబుతోంది. క్షుణ్ణంగా గమనిస్తే వాస్తవ దూరంగా ఉండే చిత్రాలు, వింత వింత లైటింగ్, నీడలు, చిత్రాల్లో అసమానతలు తదితర తప్పులను మనం గుర్తుపట్టొచ్చని తెలిపింది. ఈ వీడియోలో దీనికి సంబంధించిన ఒక్కో అంశాన్ని సునిశితంగా వివరించింది. ఉదాహరణకు.. ఏఐతో సృష్టించిన నకిలీ ఫొటోలో మనుషుల శరీర తీరు వాస్తవానికి విరుద్ధంగా ఉంటుంది. లేదా చేతివేళ్లు, కాలి వేళ్లు అసహజంగా కన్పిస్తాయని వీడియోలో పేర్కొంది. ఇక, ఎడిట్ చేసే ఫొటోల్లో నీడలు తేడాగా ఉంటాయని తెలిపింది. వీటిని పరిశీలిస్తే ఏది వాస్తవమో, ఏది నకిలీనో కనిపెట్టొచ్చని సూచించింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఇటీవల కొందరు సినీతారల డీప్‌ఫేక్ వీడియోలు కలకలం రేపిన విషయం తెలిసిందే. దీంతో ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించిన కేంద్ర ప్రభుత్వం నకిలీలను అడ్డుకునేందుకు కొత్త ఫ్రేమ్‌వర్క్‌ను రూపొందిస్తామని తెలిపింది. లోక్‌సభ ఎన్నికల తర్వాత దీనిపై చట్టం తీసుకొచ్చే అవకాశాలు కన్పిస్తున్నాయి.
డీప్‌ఫేక్ ఫొటోలను గుర్తించేందుకు వీడియోను షేర్ చేసిన కేంద్రం !
الثلاثاء، 21 مايو 2024
science technology క్షుణ్ణంగా గమనిస్తే వాస్తవ దూరంగా ఉండే చిత్రాలు డీప్‌ఫేక్ ఫొటోలను గుర్తించేందుకు వీడియోను షేర్ చేసిన కేంద్రం నీడలు ప్రెస్ ఇన్‌ఫర్మేషన్ బ్యూరో వింత వింత లైటింగ్
ليست هناك تعليقات:
إرسال تعليق