బెంగళూరులో ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలోని ఫామ్‌హౌస్‌పై సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ దాడి చేసింది. జీఆర్ ఫామ్‌హౌస్‌లో తెల్లవారుజాము 3గంటల వరకు పార్టీ జరిగినట్లు పోలీసులు చెబుతున్నారు. తనిఖీల్లో డ్రగ్స్ కూడా పట్టుబడటం సంచలనంగా మారింది. 17 ఎండీఎంఏ ట్యాబ్లెట్లు, కొకైన్ స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. బెంగళూరు, ఏపీ, తెలంగాణ నుంచి వంద మందికి పైగా హాజరయినట్లు తెలుస్తోంది. ఈ పార్టీలో 25 మందికి పైగా యువతులు ఉన్నట్లు చెబుతున్నారు. తెలంగాణకు చెందిన వాసు అనే వ్యక్తి ఈ పార్టీని హోస్ట్ చేసినట్లు చెబుతున్నారు. హైదరాబాద్‌కి చెందిన వాసు పూర్తి డీటెయిల్స్ ఏంటి..? పుట్టినరోజును ఇంత గ్రాండ్‌గా ఎందుకు ప్లాన్ చేశారు..? 100 మందిని పిలిచారు.. ఇందులో VVIPలు, సెలబ్రిటీలు ఉన్నట్టుగా చెప్తున్నారు. దీనిపైనే ఇప్పుడు పూర్తి సమాచారం రాబట్టే పనిలో ఉన్నారు బెంగళూరు ఎలక్ట్రానికిక్ సిటీ పోలీసులు. సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ ఇప్పటికే ఈ రేవ్ పార్టీపై కేసు నమోదు చేసింది. ఈ రేవ్ పార్టీకి హైఎండ్, పోష్ కార్లు చాలా వచ్చాయ్. వాటిల్లో ఓ బెంజ్ కార్ ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. దానికి కారణం.. ఆ కార్‌పై ఏపీ ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి స్టిక్కర్ ఉంది. దీనిపై టీవీ9 ప్రతినిధి ఎమ్మెల్యే కాకాణిని కాంటాక్ట్ చేసినప్పుడు ఆయన క్లారిటీ ఇచ్చారు. ఈ కారుతో తనకు ఎలంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ఆ కారు తనది కాదని.. తన పేరును ఎవరో వాడుకుంటున్నారని చెప్పారు. రేవ్ పార్టీకి చాలా మంది సెలబ్రిటీలు కూడా హాజరైనట్టు చెప్తున్నారు. టాలీవుడ్‌కి చెందిన కొందరిని పోలీసులు విచారిస్తున్నట్టు సమాచారం.
బెంగళూరులో రేవ్ పార్టీపై పోలీసులు దాడి !
الاثنين، 20 مايو 2024
17 ఎండీఎంఏ ట్యాబ్లెట్లు Andhra Pradesh Criem karnataka telangana కొకైన్ స్వాధీనం బెంగళూరులో రేవ్ పార్టీపై పోలీసులు దాడి
ليست هناك تعليقات:
إرسال تعليق