వాట్సాప్ లో పొరపాటు ఎవరికైనా తప్పుడు మెసేజ్ పంపిస్తే డిలీట్ చేసేందుకు 'డిలీట్ ఫర్ ఆల్' ఫీచర్‌ను తీసుకొచ్చారు. కొన్ని సందర్భాల్లో 'డిలీట్ ఫర్ ఆల్' ఆప్షన్‌కు బదులుగా 'డిలీట్ ఫర్ మీ' నొక్కుతుంటాం. దీంతో మనం పంపిన వాళ్లకు మెసేజ్ చేసే అవకాశం ఉండదు. అయితే ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు వాట్సాప్ కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. వాట్సాప్ త్వరలోనే 'అన్ డూ డిలీట్ ఫర్ మీ' అనే కొత్త ఫీచర్‌ను తీసుకొస్తోంది. ఈ కొత్త ఫీచర్ సహాయంతో డిలీట్ ఫర్ మీ చేసిన మెసేజ్ ను అన్ డూ చేసుకునే అవకాశం కల్పించనున్నారు. ప్రస్తుతం టెస్టింగ్ స్టేజ్‌లో ఉన్న ఈ ఫీచర్‌ను త్వరలోనే అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇంతకీ ఫీచర్ ఎలా పనిచేస్తుందంటే. మీరు డిలీట్ ఫర్ మీ క్లిక్ చేయగానే.. అన్ డూ డిలీట్ ఫర్ మీ ఆప్షన్ కనిపిస్తుంది. ఆ ఆప్షన్‌ను క్లిక్ చేయగానే డిలీట్ చేసిన మెసేజ్ మళ్లీ రీస్టోర్ అవుతుంది. దీంతో మళ్లీ డిలీట్ ఫర్ ఆల్ నొక్కితో సరిపోతుంది. అయితే ఈ అన్‌డూ ఆప్షన్ కేవలం ఐదు సెకన్లు మాత్రమే ఉంటుంది.
Post a Comment