జూన్ 1వ తేదీ నుంచి అమలు అయ్యే విధంగా కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ డ్రైవింగ్ లైసెన్స్ కి సంబంధించి కొత్త రూల్స్ ప్రకటించింది. కేవలం ఆర్టీఓ ఆఫీస్ లలోనే కాకుండా ప్రైవేట్ డ్రైవింగ్ స్కూల్స్ నుంచి కూడా లైసెన్స్ లు పొందేలా కొత్త నిబంధన చేర్చారు. ఇకపై ప్రైవేట్ డ్రైవింగ్ స్కూల్స్ స్వయంగా డ్రైవింగ్ టెస్ట్ లు పెట్టి పాస్ అయిన వాళ్లకి లైసెన్స్ లు ఇస్తాయి. ఆ మేరకు ఈ స్కూల్స్ కి ప్రభుత్వం నుంచి అనుమతి ఉంటుంది. దీంతో పాటు పాత వాహనాలపైనా కఠినంగా వ్యవహరించనుంది. దేశవ్యాప్తంగా ఉన్న కాలం చెల్లిన 9 లక్షల ప్రభుత్వ వాహనాలను ఇక పూర్తిగా పక్కన పెట్టేలా ఓ రూల్ అమల్లోకి తీసుకురానుంది. తద్వారా పెద్ద మొత్తంలో కాలుష్యాన్ని తగ్గించాలని భావిస్తోంది. ఓవర్ స్పీడ్ కి రూ.1000-2 వేల వరకూ జరిమానా విధించనున్నారు. ఒకవేళ మైనర్ డ్రైవింగ్ చేస్తూ పోలీసులకు పట్టుబడితే రూ.25 వేల జరిమానా వసూలు చేయనున్నారు. అంతే కాదు. ఆ వెహికిల్ రిజిస్ట్రేషన్నీ రద్దుచేస్తారు. ఆ మైనర్ కి పాతికేళ్లు వచ్చేంత వరకూ డ్రైవింగ్ చేయకుండా ఆంక్షలు విధిస్తారు. లైసెన్స్ లు పొందే విషయంలో గతంలో ఉన్న డాక్యుమెంటేషన్ ప్రాసెస్ ని పూర్తిగా తగ్గించనుంది. పేపర్ వర్క్ ఎక్కువగా లేకుండానే లైసెన్స్ తీసుకునేలా కొత్త రూల్స్ తీసుకురానుంది. టూవీలర్, ఫోర్ వీలర్ ఇలా ఏ వెహికిల్ కోసం లైసెన్స్ అప్లై చేస్తున్నామన్న దాన్ని బట్టి కొంత వరకూ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఏదో ఒకటి రెండు చెకప్ ల కోసం మాత్రం ఆర్టీఓ ఆఫీస్ కి వెళ్లాల్సి వస్తుంది.
మైనర్ డ్రైవింగ్ చేస్తే రూ.25 వేల జరిమానా, రిజిస్ట్రేషన్ రద్దు ?
الأربعاء، 22 مايو 2024
national RTO ఈ స్కూల్స్ కి ప్రభుత్వం నుంచి అనుమతి ప్రైవేట్ డ్రైవింగ్ స్కూల్స్ నుంచి కూడా లైసెన్స్ లు మైనర్ డ్రైవింగ్ చేస్తే రూ.25 వేల జరిమానా రిజిస్ట్రేషన్ రద్దు ?
ليست هناك تعليقات:
إرسال تعليق